మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ షో స్టార్ మా ఛానెల్లో ప్రారంభం కాబోతుంది. కానీ ఈ షో పై గతంలో ఎప్పుడూ లేని విధంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తున్నాయి. శ్వేతా రెడ్డి అనే యాంకర్ ఈ షోపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఫిదా ఫేమ్ గాయత్రి గుప్తా కూడా గతంలో బిగ్ బాస్ షో సీజన్ 2 లో తనకు అవకాశం వచ్చిందని తనను 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా అని ప్రశ్నించారని చెప్పింది. 
 
శ్వేతా రెడ్డి బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ షో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మహిళల్ని కమిట్మెంట్ ఇస్తారా, కాస్టింగ్ కౌచ్ కు రెడీయా అన్నట్లు మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ కో ఆర్డినేటర్స్ మా బాస్ ను ఎలా సాటిస్ఫై చేస్తారు, మీ బాడీని ఎప్పుడు తగ్గించుకుంటారు, మీరు వర్కౌట్స్ ఎప్పుడు చేస్తారు అని అడిగారని చెప్పారు. ఇందులో మొత్తం నలుగురు ముఖ్యంగా ఉన్నారని యాంకర్ శ్వేతా రెడ్డి మీడియాతో చెప్పింది. 
 
ముఖ్యంగా శ్యామ్ అనే ప్రొడ్యూసర్ తనతో అసభ్యకరంగా మాట్లాడినట్లు శ్వేతా రెడ్డి చెప్పింది. మరి ఈ వివాదం పెద్దదైతే మాత్రం బిగ్ బాస్ షోకు ఇబ్బందులు తప్పవు. స్టార్ మా యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలపై స్పందించలేదు. బిగ్ బాస్ షో కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది స్టార్ మా యాజమాన్యం. ఈ వివాదాల వలన బిగ్ బాస్ ఆగిపోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి 



మరింత సమాచారం తెలుసుకోండి: