ఒక్కోసారి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి. మంచి పేరున్న సినిమా కోసం కొన్ని సినిమాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదన్నయ్యా.. అందులో గుర్తుండిపోయేవి ఎన్ని అనే లాజిక్ ఇక్కడ పని చేస్తుంటుంది. అల్లరి నరేశ్ విషయంలోనూ అలాగే జరిగింది.


అల్లరి నరేష్ హీరోగా బంగారు బుల్లోడు అనే సినిమాను ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. కొంత షూటింగ్ కూడా చేశారు. కానీ ఇంతలో అల్లరి నరేశ్ కు మహర్షి సినిమా ఆఫర్ వచ్చింది. మహేశ్ బాబు సినిమా.. అందులోనూ సినిమాలో కీలకమైన పాత్ర.. నాలుగు కాలాల పాటు గుర్తుండిపోయే పాత్ర.. పాపం.. నరేశ్ ఆ సినిమా వైపే మొగ్గు చూపాడు.


అందుకే వరుస షెడ్యూళ్ల కారణంగా మహేశ్ బాబు మహిర్షికి కేటాయించడం వల్ల.. బంగారు బుల్లోడు కాస్తా గ్యాప్ వచ్చేసింది. మధ్యలో మహేశ్ బాబు మహర్షి ఆఫర్ రాకపోయి ఉంటే.. ఈపాటికి బంగారు బుల్లోడు సినిమా ఆల్ రెడీ థియేటర్లలో రిలీజై ఉండేది కూడా. కానీ మహర్షి పుణ్యమా అని అది కాస్తా ఆలస్యమైంది.


పోనీ.. మహర్షి పూర్తయిన వెంటనే అయినా మళ్లీ బంగారు బుల్లోడు ట్రాక్ పైకి ఎక్కిందా అంటే అదీలేదు.. ఏ కారణం వల్లో కానీ బంగారు బుల్లోడు సినిమాకు బాగానే గ్యాప్ వచ్చేసింది. మళ్లీ కొంత కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు బంగారు బుల్లోడు ట్రాక్ పైకి ఎక్కేలా కనిపిస్తోంది. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా అనేక సినిమాలు విషెష్ చెబుతూ పోస్టర్లు విడుదల చేశాయి. ఈ బంగారు బుల్లోడు కూడా మరోసారి అలా తెరపైకి వచ్చాడు. నవంబర్ లో దీపావళి కానుకగా సినిమా రిలీజ్ అంటూ ప్రకటించారు. మరి ఈ సారైనా ఈ బంగారు బుల్లోడు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని అనుకున్న సమయానికి వస్తాడా.. లేదా..?


మరింత సమాచారం తెలుసుకోండి: