సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తించారు. ప‌వ‌న్ అభిమానులు అంద‌రూ ప‌వ‌న్ డీపీల‌ను పెట్టుకుని రోజంతా ప‌వ‌న్ ఫొటోలు పోస్ట్ చేస్తూ త‌మ అభిమాన హీరోపై ఉన్న అభిమానాన్ని ఘ‌నంగా చాటుకున్నారు. ఓవ‌రాల్‌గా ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్న ప‌వ‌న్ అభిమానులు ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలుపుతూ రికార్డ్ స్థాయిలో ట్వీట్లు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా  పవన్‌కు విషెస్‌ తెలుపుతూ ట్వీట్ చేశారు. 


ప‌వ‌న్‌ను వ్య‌తిరేకించే అభిమానులు నెగిటివ్ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టి కూడా గ‌ట్టిగానే ప్ర‌చారం చేశారు. ఓ హీరోయిన్ మాత్రం ప‌వ‌న్ పేరును త‌ప్పుగా పోస్ట్ చేసి బ‌ర్త్ డే విషెస్ చెప్పి తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. ఆమె ప‌వ‌న్ ప‌క్క‌న న‌టించిన హీరోయినే కావ‌డం విశేషం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న కొమ‌రం పులి సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన నికిషా ప‌టేల్ ఈ ప‌ని చేసింది. నికిషా తెలుగులో చాలా మందికి స‌రిగా తెలియ‌దు.

ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె పవన్‌కు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో ఓ పొరపాటు చేశారు. హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్ (# HappyBirthdayPawanKalyan ) అనే హ్యాష్ ట్యాగ్‌కు పోటిగా... హ్యాపీ బర్త్‌డే పావలా క‌ళ్యాణ్ (#HappyBirthdayPawalaKalyan) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నికిషా పొర‌పాటుగా పావలా కల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో విషెస్‌ను ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ బాగా వైర‌ల్ అయ్యింది. 


ఆ త‌ర్వాత  కొద్దిసేపటికి జరిగిన పొరపాటును గమనించిన ఈ భామ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసిన మరోసారి సరైన హ్యాష్ ట్యాగ్‌లతో ట్వీట్ చేశారు. అయితే అప్ప‌టికే నికిషా ట్వీట్ వైర‌ల్ అవ్వ‌డంతో ఆమెను ప‌వ‌న్ ఫ్యాన్స్ బాగా టార్గెట్ చేశారు. చివ‌ర‌కు ఆమె ప‌వ‌న్ అభిమానుల‌ను శాంతింప జేసేందుకు క్షమాపణ కూడా కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: