సినిమా రంగంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడేవారు.  పవన్ సినిమా అంటే ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని తేడా లేకుండా అందరూ ఆసక్తిగా చూసేవారు. బద్రి, ఖుషి సినిమాలు ఏ రేంజ్ లో యూత్ ను ఆకట్టుకున్నాయో చెప్పక్కర్లేదు.  అంతకు ముందు సినిమాలు ఒకెత్తయితే.. ఆ తరువాత బద్రి నుంచి వచ్చిన సినిమా మరొక ఎత్తు.  


బద్రి సినిమాలో పవన్ నటనకు ఫిదా అయ్యారు యువత.  మహిళలు కూడా పవన్ కళ్యాణ్ ను ఎక్కువా ఇష్టపడతారు.  సినిమా పరిశ్రమలో ఉండే వ్యక్తులు కూడా పవన్ అంటే మహా ఇష్టం.  అలా ఇష్టపడిన హీరోయిన్లలో తెలుగు హీరోయిన్ మాధవీలత కూడా ఉన్నది.  గతంలో నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసినపుడు పవన్ కు బాసటగా నిలిచింది.  అనంతరం మాధవీలత బీజేపీలో జాయిన్ అయ్యి గుంటూరు నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే.  


ఇదిలా ఉంటె 2000 వ సంవత్సరంలో బద్రి సినిమా రిలీజ్ అయ్యింది.  ఆ సినిమా సూపర్ అయ్యింది.  ఆ సినిమాతో చాలామంది అమ్మాయిలు పవన్ ను ఇష్టపడ్డారు. అలా ఇష్టపడి.. కష్టపడి మాధవీలత పవన్ కు ఓ ప్రేమ కవిత రాసింది. 2000 సంవత్సరం, జూన్ 6 వ తేదీన ఆ కవితను రాసుకుంది.  ఇటీవలే ఆ కవితను మాధవీలత తన పేస్ బుక్ పీజీలో పోస్ట్ చేసింది.  


‘‘మనసులో ఏదో వేదనకారణం తెలియక పడుతున్నా తపన
హృదయంలో అనురాగం అనే భావనదానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన
నీవు కనిపించగానే నా హృదయంలో ఏదో బాధ
నా మనస్సుని ఎవరో గట్టిగా పట్టేసినట్టుగా వేదన
ఒక పక్క సంతోషం, మరోపక్క దుఃఖం కానీ,.... కానీ ఎందుకో తెలీదు
నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను.
దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను?ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?
నో . కానే కాదు. అటువంటిది కాదు. మరేంటి?.....?’’ 

ఈ కవిత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  బీజేపీ నేత ఇలా పవన్ కు ప్రేమకవిత రాయడం వెనుక ఆయనపై ఉన్న అభిమానమే అని చెప్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: