హాలీవుడ్ సినిమాలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది జేమ్స్ బాండ్ సినిమాలే.  బాండ్ సినిమాల్లో హీరోలు గన్ పట్టుకొని ఫైట్స్ చేస్తుంటారు.  సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తూ.. ఇచ్చిన టాస్క్ ను కంప్లీట్ చేస్తుంటారు.  ఇక బాండ్ గర్ల్స్ తో రొమాన్స్ చేస్తుంటారు.  ప్రపంచంలో సినిమా రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి.  మహిళలు సైతం సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంటారు.  మహిళా చిత్రాలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఆదరణతోనే మరిన్ని సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.  


సూపర్ హీరోస్ గా మహిళలు కూడా నటిస్తూ మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.  మహిళలు ఎందులోనూ తక్కువగా ఉండటం లేదు.  ప్రతి రంగంలోనూ దూసుకుపోతున్నారు.  చాలా అడ్వాన్స్ గా ఉంటున్నారు.  ఇంకా చెప్పాలి అంటే పురుషులకంటే మహిళలే ఎక్కువ స్పీడ్ గా ఉంటున్నారు.  పని విషయంలోనూ పోటీ పడి పనిచేస్తున్నారు.  ఇలా అన్ని రంగాల్లో ముందుంటున్న మహిళలు జేమ్స్ బాండ్ సినిమాల్లో మాత్రం బాండ్ గర్ల్స్ గా హీరోలతో రొమాన్స్ చేయడానికి తప్పా మరెందుకు పనికిరారా.. 


దీనికి సమాధానం త్వరలోనే దొరకబోతున్నది.  బాండ్ సిరీస్ లో నాలుగు సినిమాల్లో నటించిన ప్రియస్ బోసనన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.  ఇప్పటి వరకు సీరీస్ లో 24 సినిమాలు వచ్చాయి.  ఒక్కో సినిమా కాలానికి అనుగుణంగా మార్పులు చేసి చిత్రీకరించారు. అంతా బాగున్నది. ప్రస్తుతం 25 వ సినిమా తీస్తున్నారు.  ఇందులో డేనియల్ క్రేగ్ హీరో.  ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నది.  


బాండ్ సినిమాల్లో మగవాళ్లే హీరోలుగా కనిపించారు. ఇకనైనా కొన్ని సినిమాల్లో మహిళా బాండ్ లతో తీయాలని హితవు పలికాడు ప్రియస్.  ప్రియస్ అభ్యర్ధనను బాండ్ నిర్మాతలు ఆలకించినట్టున్నారు.. దీనికోసం ప్లాన్ చేస్తున్నారు.  నటి లస్నా లించ్ హీరోయిన్ గా బాండ్ సినిమాను తీసేందుకు రెడీ అవుతున్నట్టు తెలిపారు.  ఇది నిజంగా ఆహ్వానించదగిన విషయంగానే చెప్పాలి.  మహిళల బాండ్ సినిమాలో బాండ్ బాయ్స్ గా మగవాళ్ళు నటిస్తారేమో.  వినడానికి బాగున్నా.. చూస్తే ఎలా ఉంటుందో.. జంబలకడి పంబ టైపులో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: