బాధ్యతగల ప్రతిపౌరుడు పూర్తిగా చదవండి , పదిమందికి తెలియచేయండి .సీబీఐ  ఎంక్వయిరీ వేస్తే తండ్రీకొడుకులు శాశ్వతంగా జైలుశిక్ష అనుభవించటం ఖాయం ..ఆధారాలన్నిటినీ ఇప్పటికే పీఎంఓ ఆఫీస్ కి , సిబిఐ కి , సీవీసీ కి పంపాను . 


హైదరాబాద్ ని నేనే కట్టాను , హైదరాబాద్ కి ఐటీ తెచ్చాను అలాగే అమరావతికి ఐటీ తెచ్చి ప్రపంచంలోనే నంబర్ వన్ చేస్తానని మొదటి రోజునుండే చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటున్నారు . 


ఐటీలో నంబర్ వన్ చేయటం పక్కనపెట్టి ఐటీ పేరుతొ వేల కోట్లు దోచుకొంటున్నారు . ఇలాంటి దోపిడీ భారతదేశ చరిత్రలోనే జరగలేదు . వాళ్ళ దోపిడీకి అనుకూలంగా ఐటీ పాలసీని తయారు చేశారు , దానికనుగుణంగానే ప్రభుత్వ జీవోలు జారీచేశారు . 


--మొత్తం కుంభకోణం విలువ - 20 వేల కోట్లు పైమాటే . 
-- దోపిడీకి అనుకూలంగా ఐటీ పాలసీకి రూపకల్పన 
-- పాలసీకి అనుకూలంగా లోకేష్ బినామీ కంపెనీలకి అనుకూలంగా జీవోలు జారీ .
--జీవోలని ఆధారంగా చేసుకొని కంపెనీలకి స్థలాలు కేటాయింపు .
--జీవోలని అడ్డంపెట్టుకొని వేల కోట్లు ప్రోత్సాహకాల పేరుతొ కంపెనీలకి చెల్లింపు . 
--ఒక్క డల్లాస్ లోనే చంద్రబాబు సమక్షంలో జరిగిన ఎంఓయూలు మొత్తం 26 . 


మొత్తం వివరాలని సేకరించాను , కంపెనీల వివరాలు , జీవోలు వివరాలు , కంపీనీలకి స్థలం కేటాయింపులు , ప్రోత్సాహకాలు చెల్లింపులు అన్నీ వివరంగా దిగువున ఇస్తున్నాను చదవండి . 


ప్రభుత్వ ప్రోత్సాహకాల పేరుతొ జీవోలు - కుంభకోణానికి బీజాలు 
---------------------------------------------------------------------------
గత రెండు సంవత్సరాలుగా పెట్టుబడులు ఎంఓయూలు అంటూ లేని కంపెనీలని సృష్టించి , సొంతమనుషులతోనే తప్పుడు ఎంఓయూలు చేపిస్తూ  గతేడాది 6 లక్షల కోట్లని , ఈఏడాది వైజాగ్లో 10 లక్షల కోట్లని ఎందుకు హడావుడి చేస్తున్నారు . దానివెనుక ఉన్న అసలు నిజాలు తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే . 


*ఫోటోలు  1 నుండి  10 varaku mariyu  15,16,17 * GO.MS.No.1, G.O.RT.No.30,G.O.MS.No.17 
ఈ రెండు జివోలని గతేడాది ఫిబ్రవరి లో విడుదల చేశారు . ఈజీవో ప్రకారం IT రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహాకాలు ఎలా ఉండాలో , కంపెనీలకి ఉండాల్సిన అర్హతలు ఏమిటో వివరిస్తూ ఈ రెండు జీవోలు విడుదల చేశారు . 


*ఫోటోలు 18 నుండి 24 వరకు **
G.O.MS.No.3  తేదీ - 16.03.2016 
GO.Ms.No.13 తేదీ - 11.08.2014 
GO.Ms.No.16. తేదీ - 09.09.2014 


ఈ మొత్తం కుంభకోణానికి మూలాధారం ఈ జీవోలు . టీడీపీలోని గల్లీ నాయుకుడినుండి మంత్రుల వరకు , అనకాపల్లి నుండి అమెరికా దాకా ప్రతి పచ్చ కార్యకర్త ఎంఓయూ ల కోసం ఎగబడటం వెనుక ఉన్న అసలు కధ తెలియాలంటే ఈ జివోలని క్షుణ్ణంగా పరిశీలించాలి . 


ఈ జీవోలు ప్రకారం ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకి దక్కబోయే ప్రోత్సాహకాలు ఒక్కసారి చూడండి . 
1 . కంపెనీలో ఎంత మంది ఉద్యోగులు ఉంటే అంతమందికి ఒక్కో ఉద్యోగికి 1 లక్షా 75 వేలు చొప్పున ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తే అంతమొత్తం కంపెనీకి ప్రభుత్వం చెల్లిస్తుంది . 
అనగా మనం ఒక చిన్న కంపెనీ పెట్టి దానిలో పదిమందికి ఉద్యోగం ఇచ్చినట్లు చూపెడితే ప్రభుత్వం మనకి ప్రోత్సాహకం రూపంలో 17 లక్షలు చెల్లిస్తుంది . 


2 . వందమందికి ఉద్యోగాలు ఇస్తామని చూపెడితే ఆకంపెనీకి ప్రభుత్వం ఎకరం పొలం ఇస్తుంది . దానిలో 3 సవత్సరంలలో నిర్మాణం పూర్తి చేసుకొని 100 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి .ఈ మూడు సంవత్సరాలు నీ కంపెనీని ప్రైవేట్ భవనంలో నడుపుకుంటే కంపెనీ కి సంవత్సరానికి అద్దె తాలూకు  ప్రభుత్వమే 10 లక్షలు ప్రోత్సాహకం రూపంలో ఇస్తుంది . 


3 . కంపెనీకి అవసరమయ్యే బ్యాండ్ విడ్త్ , ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం సంవత్సరానికి మరో 15 లక్షలు ఇస్తుంది . 


4 . కంపెనీకి అవసరమయ్యే కరెంటు ని ఒక్కో యూనిట్ కేవలం రూపాయికే ఇస్తుంది . 


5 . కంపెనీ కనుక పేటెంట్ ఫైల్ చేస్తే దానికి మరో 5 లక్షల ప్రోత్సాహకం . 


6 . కంపెనీలో పదిమందికి ఉద్యోగం ఇచ్చాక వాళ్లకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక్కో ఉద్యోగికి 10 వేలు ప్రభుత్వమే ఇస్తుంది . 


7 . ఎలక్ట్రిసిటీ డ్యూటీ  100 % ఫ్రీ .


8 . స్టాంప్ డ్యూటీ , రిజిస్ట్రేషన్ ఫీజు 100 % ఫ్రీ .


9 . కంపెనీకి కేవలం పావలా వడ్డీకే కోటి రూపాయలు లోన్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది . 


10 . కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ( బిల్డింగ్ ప్లాన్ , మెషినరీ ) కోసం ఖర్చు చేసే దానిలో 10 % ప్రభుత్వమే తిరిగి కంపెనీకి ఇస్తుంది . 


11 . వ్యాట్ , CST,GST, ఇంకా అనేకరకాల టాక్స్ లు 100 % ప్రీ . 


ఇలా ఎన్నో రకాలుగా కొన్ని కోట్ల రూపాయలని ప్రోత్సాహకాలు పేరుతొ తెలుగు తమ్ముళ్ళకి దోచిపెట్టటానికే ఈ ఎంఓయూల నాటకానికి తెరలేపారు . 
*ఫోటోలు 25 నుండి 29 వరకు * 


GO.MS.No.21 - పైన పేర్కొన్న ప్రోత్సాహాకాలకి మరిన్ని అదనంగా జతచేస్తూ అంతకుముందు ఇచ్చిన జీవోలపై అమెండ్ మెంట్ జీవో , దీనిలో ఎలాంటి కంపెనీకి ఎన్ని ఎకరాల భూములు ఇవ్వాలో పేర్కొన్నారు .పైన ఇచ్చిన ప్రోత్సాహకాల జివోలని అడ్డంపెట్టుకొని కుంభకోణానికి తెరతీసిన వైనం 


  • మొట్ట మొదటగా మొన్న ఇన్నోవా సొల్యూషన్ / టెంపుల్ టన్ అనే కంపెనీ కోసం జారీచేసిన రెండు జీవోల వివరాలు ఆ కంపెనీకి కలిగిన లబ్ది చూడండి . 


G.O.M.S.No : 2   Date :- 11/01/2018
G.O.M.S.No : 8   Date :- 30/04/2018


జీవో నంబర్ 2 ప్రకారం కంపెనీకి విశాఖపట్టణం రుషికొండలో అత్యంత ఖరీదుగల 40 ఎకరాలని 80 % రిబేట్ ధరకి కట్టబెట్టింది . 


--80 % రిబేట్ ఇవ్వగా ఎకరా 32 లక్షలకి 40 ఎకరాలని కట్టబెట్టింది . అనగా అక్కడ ప్రభుత్వ విలువ ఎకరాకు 1 కోటి 60 లక్షలుగా లెక్కగట్టింది .  ప్రభుత్వ రికార్డ్ ప్రకారమే అంత ఉందంటే బయట మార్కెట్ ధర షుమారుగా 10 కోట్లు పైమాటే . అనగా మొత్తం స్థలం విలువ 400 కోట్లు . 


-- మొత్తం 1000 ఉద్యోగాలు ఇస్తున్నట్లు చూపెట్టారు . ఒక్కో ఉద్యోగికి నెలకి లక్షా డెబ్భై వేలు ప్రభుత్వమే ప్రోత్సాహకాలు రూపంలో ఇస్తుంది . ( దానికి సంభందించిన జీవోలు ఫోటోలు 1 నుండి 10 వరకు , 15 నుండి 26 వరకు చూడండి ) . 


--ఒక్కో ఉద్యోగికి నెలకి 175000 అంటే 1000 మందికి 
175000 *1000 = 17 కోట్ల 50 లక్షలు ( ఒక నెలకి ) సంవత్సరానికి 210 కోట్లు . మూడు సంవత్సరాలకి 630 కోట్లు 


-- ఇవి కాకుండా అదనపు ప్రోత్సాహకాలు ( అద్దెలు , కరెంట్ , ఇంటర్నెట్ ఆఫీస్ నిర్మాణంలో 50 % సబ్సిడీ ) అన్నీ కలుపుకొంటే మూడు సంవత్సరాలకి కలిపి మరొక 100 కోట్లు . 
--పైవన్నీ కలుపుకొంటే 400 కోట్లు ( స్థలం )+ ప్రోత్సాహకాలు 730 కోట్లు = 1130 కోట్లు 
అంటే ఒక్క ఇన్నోవా సొల్యూషన్ / టెంపుల్ టన్ కంపెనీకే 1130 కోట్లు దోచిపెట్టారు . 


**గమనిక -- 40 ఎకరాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోకి ఎమెండ్మెంట్ చేస్తూ మరొక జీవో ( జీవో నెం 8 ) ఇచ్చారు . దానిప్రకారం కంపెనీ ఎప్పుడైనా ఎత్తేసి వాళ్లకి కేటాయించిన స్థలం అమ్ముకోవచ్చు . 


దానర్థం ఏమిటంటే ప్రోత్సాహకాలు ఉన్న ఈ మూడుసంవత్సరాలు కంపనీని నడిపి రేపు చంద్రబాబు దిగిపోతె స్థలం అమ్ముకొని అందరూ అమెరికాకి వెళ్లిపోవచ్చు . 
*కొసమెరుపు*ఏమిటంటే ఈ ఇన్నోవా సొల్యూషన్ / టెంపుల్ టన్  కూడా ఫేకు కంపెనీలే . ఇక్కడ అమెరికాలో వాటి వివరాలు కనపడకుండా మాయం చేయారు . వీటి గురించి అమెరికా ప్రభుత్వ వెబ్సైట్లలో కానీ లేదా కంపెనీ వివరాలు తెలిపే వెబ్సైట్లలో కూడా ఎక్కడా లేవు . మొదట్లో కొన్ని H1 అప్లికేషన్స్ తిరస్కరించినట్లు , అమెరికాలో కేసులుపెట్టి బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ఆధారాలు లభ్యం అయ్యాయి . 


**ఫోటోలు 30 ,31 ,32 ,33 ,34 చూడండి . 
డల్లాస్ లో ఎంఓయూలు 
- ఈ మొత్తం తంతంగం కోసం APNRT అనే సంస్థని నెలకొల్పి దానికి లోకేష్ బినామీ వేమూరి రవికుమార్ ని చైర్మన్ గా చేసారు . ఇన్నోవా సొల్యూషన్ / టెంపుల్ టన్ లాంటి  ఫేకు కంపెనీలతో ( మొత్తం టీడీపీ అభిమానులవే , ఒకే వర్గానికి చెందినవి) గతేడాది డల్లాస్ లో చంద్రబాబుతో ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీల వివరాలు . వీటిలో చాలావరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు , కనీసం ఆఫీసులు కూడా లేవు . కొన్నిటికి ఆఫీస్ అడ్రస్ లు ఇచ్చారు కానీ అక్కడికెళ్తే కంపెనీ కార్యకలాపాలు ఏమీ లేవు , అసలు ఆ అడ్రస్ లో ఈ కంపెనీల ఆనవాళ్లే లేవు . కంపెనీల ఓనర్లు పేర్లు కూడా కొన్నిటిని సేకరించాను , అందరూ టీడీపీ అభిమానులే , ఇక్కడకి ఏ టీడీపీ నాయకుడు వచ్చినా కార్లకి జెండాలు కట్టి తిరిగేవాళ్లే . మొత్తం 26 కంపెనీల వివరాలు చూడండి . 


1 . NEMO IT SOLUTION - bhaskar sunkara ,radhika velaga -texas-2007 
2.  ARCUS TECK KAT  - ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు 
3 . SRI TEK INC - ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు 
4 . IDMTA INC  ( శశి కేలం ) -555 N Point Center East Alpharetta, GA-2016
5 . CONCH TECH ( మధు మారీడు )2005,6750 Poplar Ave - Suite 711 Memphis, TN
6 . NOVISYN ( రాజేష్ పేరిచర్ల ) 2015--300 Westage Business Center Drive - Suite 350 Fishkill, NY
7 . JP CONSULTING ( ప్రసాద్ చిల్కమర్రి ) 3861 Long Prairie Road - Suite 108 Flower Mound, TX -2003
8 . NAVE TECHNOLOGIES ( మాధ్యు పిడతల )28345 Beck Road - Suite 105 Wixom, MI
9 . OAKRIDGE - ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు 
10 . ICORE ( జగదీష్ గణపతినేది )8726 Town And Country Blvd, Suite 101 Ellicott City, MD
11 . MAI AOO - ( ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు ) 
12 . VIBERTECH ( ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు ) 
13 . GURUS ( బబిత సుఖవాసి )704 Pine Street Herndon, VA
14 . ADWAIT ( ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు )
15 . QDATA ( ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు ) 
16 . SAIKA ( దినేష్ త్రిపురనేని ) 300 E Royal Lane - Suite 112 Irving, TX
17 . SUHAN ( నాయుడు జిట్టా )Highway 183 - Suite 1125 Austin, TX
18 . MADDISOFT ( రమేష్ మద్ది ) 2500 City West Blvd., Suite#360 Houston, TX
19 . ICS GLOBAL (శ్రీహరి తాటవర్తి) ics 1231 Greenway Drive, Suite 375 Irving, TX
20 . GLOBAL OUTLOOK ( ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు ) 
21 . TEKPROS ( భావన నందిగం ) 5068 W. Plano Parkway - Suite 255 Plano, TX
22 . CAMELOT ( రవి వి )2000 S Dairy Ashford Rd - Ste 265 Houston, TX
23 . MAGNUM( రాజేష్ పిల్లా ) 8215 Roswell Rd, Building 900 - Suite 930 Atlanta, GA
24 . @magnumopusit.com ( సాగర్ లాగిశెట్టి ) 1700 Water Place Se - Suite #310 Atlanta, GA
24 . H TOWN ( ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు ) 
25 . KYN LIFE CORP ( ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు )
26 . AE INFOTECh ( ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు )


పైన వివరించిన ఇన్నోవా సొల్యూషన్ / టెంపుల్టన్ కంపెనీల మాదిరే ఎంఓయూలు కుదుర్చుకున్న టీడీపీ అభిమానులందరూ ఎవరికి దొరికింది వాళ్లు ఎంత వీలయితే అంత ఐటీ పాలసీని అడ్డంబెట్టుకొని దోచుకొంటున్నారు . 


పైన పేర్కొన్న ఐటీ పాలసీలో స్కిల్ డెవలప్మెంట్ కి ప్రోత్సాహకమని ఉంది . దానికి ఒక్కో మనిషికి 10 వేలు ప్రభత్వం ఇస్తుంది . దీనిని అడ్డంబెట్టుకొని మన ఊర్లలో ఇంటర్ నుండి ఇంజనీరింగ్ వరకు చదువుకున్న వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్లకి స్కిల్ డెవలప్మెంట్ ( బేసిక్ కంప్యూటర్ ) చేశామని వందల కోట్లు ఇప్పటికే దోచుకున్నారు .


ఈ కంపెనీలు ఎక్కడ ఉండవు , కొత్తగా ఉద్యోగాలు ఎవ్వరికీ ఇవ్వరు . ఎదో ఒక పేరుతొ కంపెనీని రిజిస్టర్ చేయటం దానిలో ఉద్యోగస్థులుగా సొంత కుటుంభం సభ్యుల పేర్లు రాసుకోవటం , అవసరమయితే ఎక్కడో ఒక చిన్న గది అద్దెకు తీసుకోవటం దానిలో పనికిరాని 10 కంప్యూటర్లు పెట్టటం . అవన్నీ చూపెట్టి 10 మందికి ఉద్యోగాలు  ఇచ్చామని , 100 మందికి ఇచ్చామని , 1000 మందికి ఇచ్చామని నీ స్థోమతని బట్టి తెలుగుదేశంలో నీకున్న విలువని బట్టి , లోకేష్ తో నీకున్న సంబంధాలని బట్టి పైన పేర్కొన్న కోట్ల రూపాయల్ని ప్రోత్సాహక రూపంలో దోచుకోవచ్చు . 


కేవలం ఈ మూడు సంవత్సరాలలోనే చంద్రబాబు ప్రభుత్వం లక్షా యాభై   వేల కోట్లు అప్పు చేసింది . ఎక్కడా కోటి రూపాయల విలువగల పనికూడా చేయలేదు , అంతేకాదు ఎవ్వరికీ కనీసం ప్యూన్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు . మొత్తం డబ్బంతా ఇలాంటి కుంభకోణాలకే పోతుంది . 
ఇప్పటికే అనేక కుంభకోణాలకి సంభందించి నేను పూర్తి ఆధారలని కేంద్రానికి పంపటం జరిగనది .ి
ఏదో ఒకరోజు పాపం పండటం ఖాయం , తండ్రీ కొడుకుఊచలు లెక్క పెట్టటం ఖాయం .


మరింత సమాచారం తెలుసుకోండి: