రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందంగా విభజన తర్వాత ఏపి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అయినప్పటి అమరావతి కేంద్రంగా ఎన్నో నిర్మాణాలు చేశారు.  అయితే అవన్నీ రైతులను ఇబ్బంది పెట్టారని...పర్యావరణ పరిరక్షణకు పూర్తి విరుద్దంగా ఉన్నాయని నేడు ఆయన ఏర్పాటు చేసిన ప్రజావేధిక భవనాన్ని పూర్తిగా కూల్చి వేశారు.  ఇక ఏపి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తాను ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి కంకణ బద్దులయ్యారు.  ముఖ్యంగా నవరత్నాల అమలు కోసం ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షలు నిర్వహించి వాటి బాధ్యత సక్రమంగా అమలయ్యేలా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  ఏక్కడ లంచగొండి తనం, మహిళలపై లైంగిక వేధింపులు, లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలిగించే వారు ఎంతటి వారైనా నిర్థాక్షిణ్యంగా అరెస్ట్ చేసి కఠిన శిక్ష అమలు పర్చాలని ఆదేశించారు.

ఈనేపథ్యంలో ఏపీ రాజధానిగా ఇక అమరావతి ఉండబోదని తెలుస్తోంది. దీనికి బదులు గుంటూరు జిల్లాలోని తుళ్లూరును జగన్ ప్రభుత్వం రాజధానిగా చేయవచ్చునని అనధికారికంగా వార్తలు అందుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తోంది. అంతే కాదు మరీ దారుణమైన విషయం ఏంటంటే..ప్రస్తుతం ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి తాత్కాలిక రోడ్డు నిర్మించడానికి.. శేషగిరి రావు అనే రైతు దగ్గరనుండి 10 అడుగుల భూమిని సేకరించినట్టు తెలిసింది. 

ఇక కూల్చి వేతలో భాగా అక్కడ ఉన్న రోడ్డును తిరిగి ఆ రైతుకు కేటాయించాలని ప్రభుత్వం నుండి జారీ అయిన పత్రంలో నమోదు చేశారు. అలాగే రోడ్డుకోసం కేటాయించిన తమ భూములను తమకు తిరిగి అప్పగించాలని మరికొందరు రైతులు కూడా పేర్కొంటున్నారు. అంతేకాదు మాజీ సీఎం ఇంటికి వెళ్లే రోడ్డును కూడా తొలగించనున్నారని సమాచారం. అదే కాకుండా.. ప్రజావేదికతో పాటు మాజీ సీఎం ఇంటిని కూడా కూల్చబోతున్నారా..? అనేది ప్రస్తుతం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: