ఉత్తరాంధ్ర.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి. సహజ వనరులు, కోస్తా ప్రాంతం ఉన్నా.. అన్నివిధాలుగా వెనుకబడిన ప్రాంతం ఇది. కేవలం రాజధానిని మాత్రమే కాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని జగన్ సర్కారు ఆలోచనాధోరణిలో ఉంది. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తోంది.


తాజాగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పిన మాటలు ఇందుకు ఊతం ఇస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రానున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. ప్రత్యేకించి విశాఖ జిల్లా వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. తగరపువలస, పద్మనాభం ప్రాంతంలో భారీ పరిశ్రమలు రాబోతున్నదే ఆ గుడ్ న్యూస్.


తగరపువలస, పద్మనాభం ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని మంత్రి మీడియాకు వెల్లడించారు. సోమవారం తగరపువలసలో వార్డు వలంటీర్లకు ఆయన నియామక ప్రతాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామ వాలంటీర్ల సేవలకు ప్రభుత్వం సముచిత గుర్తింపునిస్తుందన్నారు. చిట్టివలస జ్యూట్‌ కార్మికుల బకాయి ఆఖరి పైసా కూడా అందేలా చేస్తానని చెప్పారు. సాధికారిత సాధించే విధంగా మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.


ఉత్తరాంధ్ర ప్రాంతంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. కొత్త పరిశ్రమలు స్థాపించాలంటే అందుకు కావలసిన భూవనరులు కూడా పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. విశాఖ మహానగరానికి అనుబంధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తే.. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.


ఉత్తాంధ్ర జిల్లాల్లోని యువత కూడా ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు నానాటికీ తగ్గిపోతున్న సమయంలో ప్రైవేటు పరిశ్రమలే ఉపాధికి మార్గంగా మారిపోయాయి. ఇప్పటికే విశాఖ కేంద్రంగా సేవల రంగం పుంజుకుంటోంది. ఇప్పుడు కొత్త పరిశ్రమలు వస్తే.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల యువత ఉపాధి కోసం హైదరాబాద్ వైపు చూడాల్సిన అవసరం తప్పుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: