పాకిస్తాన్ లో హిందువులు మైనారిటీలుగా ఉన్న సంగతి తెలిసిందే.  హిందువులపై ఇటీవల కాలంలో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.  ఈ దాడుల నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  ముఖ్యంగా ఆడపిల్లలపై అక్కడి అల్లరి మూకలు చేస్తున్న హంగామా ఇంతాఅంతా కాదు.  హిందువుల ఆడపిల్లలను అపహరించి వారిని బలవంతంగా మతం మార్చి వివాహం చేసుకుంటున్నారు.  


దీనిపై పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.  పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదవుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు.  మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  ఇదిలా ఉంటె, అక్కడ మైనారిటీలకు ఉద్యోగకు రావడమే చాలా గొప్ప విషయం.  అక్కడి హిందువులు ఏదైనా సొంత వ్యాపారం చేసుకోవాలి లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలి తప్పించి గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం. 


ఇక ఆడపిల్లలకైతే మహా కష్టం.  అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసింది పుష్పా కొలీహీ అనే యువతి.  సింధ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పాక్ పోలీస్ సర్వీస్ లో ఉద్యోగం సంపాదించింది.  పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించిన తొలి హిందూ మహిళగా పుష్పా రికార్డు సాధించింది.  ఇటీవలే జనవరిలో పాక్ లో హిందూ సామాజిక వర్గానికి చెందిన పవన్ బోదని అనే వ్యక్తి సివిల్ మేజిస్ట్రేట్ గా నియమితులైన సంగతి తెలిసిందే.  


పాకిస్తాన్ లో అధికారికంగా హిందువులు 75  లక్షలమంది వరకు ఉన్నారు.  వీరికి ఇవ్వలైన గౌవరం అక్కడి ప్రభుత్వం ఇవ్వడం లేదు.  మైనారిటీ వర్గం కింద అక్కడ వారికీ ఇవ్వాల్సిన ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు.  దీంతో అక్కడి హిందూ ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు.  ముఖ్యంగా ఇండియాకు వచ్చేస్తున్నారు.  లేదంటే వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు.  వెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించని వ్యక్తులు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: