గడచిన ఐదు సంవత్సరాల్లో నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంచలన నిర్ణయాలు అమలు చేసిన ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తనదైన మార్కు పాలనను చూపిస్తున్నారు. నరేంద్ర మోదీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటంతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మకమైన విజయాలను ఈ 100 రోజుల్లో సాధించారు. ఆగస్టు నెల 5 వ తేదీన జమ్మూ కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 ను రద్దు చేయటాన్ని చారిత్రాత్మకమైన నిర్ణయంగా చెప్పవచ్చు. 
 
ఆర్టికల్ 370 రద్దు చేయటం ద్వారా " ఒకే జెండా, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం " అనే నినాదానికి మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకురావటంతో ముస్లిం మహిళల పోరాటానికి చట్టబధ్ధమైన భద్రత కల్పించింది. ముస్లిం మహిళల యొక్క గౌరవ మర్యాదలు, సామాజిక ప్రతిష్ఠల కొరకు మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ట్రిపుల్ తలాక్ చట్టంతో మోదీ చారిత్రాత్మకమైన తప్పిదాన్ని సరిదిద్దాడు. 
 
నరేంద్ర మోదీ పరిపాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ 2.7 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. త్వరలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెరగనున్నది. మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం కొరకు 24 పంటల విషయంలో ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం గిట్టుబాటు అయ్యేలా మోదీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. 
 
దేశవ్యాప్తంగా ప్రజలకు స్వచ్చమైన మంచినీరు అందించటం కొరకు కేంద్రం జల్ శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. భారత్ అంతరిక్ష ప్రస్థానంలో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ - 2 విజయవంతమయింది. 2024 సంవత్సరంలోపు భారతదేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను విస్తరింపజేయాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించటం కోసం కొత్త మోటారు వాహన సవరణ చట్టాన్ని సెప్టెంబర్ 1 వ తేదీ నుండి మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: