రాజకీయాలు భలే విచిత్రంగా ఉన్నాయి.  ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో.. ఎలా ప్రవర్తిస్తారో తెలియదు.  ఈరోజు మిత్రులుగా ఉన్న వ్యక్తులు రేపటికి శత్రువులుగా మారిపోవచ్చు.  శత్రువులుగా ఉన్న వ్యక్తులు మిత్రులుగా మారొచ్చు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత పోలీసు కేసులు ఎదుర్కోవాలి.  పోలీసులను మ్యానేజ్ చేయాలి.  సమస్యలపై పోరాటం చేయాలి.  ధర్నాలు చేయాలి.  నినాదాలు చేయాలి.  


గోదావరి సినిమాలో రాజకీయాల్లోకి రావాలని సుమంత్ వెళ్లి ఓ రాజకీయ నాయకుడిని కలిస్తే.. నువ్వు ధర్నాలు చేయగలవా.. నినాదాలు చేయగలవా.. చెయ్యెత్తి గట్టిగా జై కొట్టగలవా అని ప్రశ్నిస్తాడు.  అంటే, రాజకీయాల్లోకి రావాలంటే మొదటగా ఉండాల్సిన క్వాలిటీ ధర్నాలు చేయగలిగే సత్తా ఉండాలి.  అలాంటప్పుడే రాజకీయాల్లోకి రాగలుగుతారు.  రాజకీయాల్లో ఎదగగలుగుతారు.  


ఇపుడు పవన్ పరిస్థితి ఇలానే మారిపోయింది. స్టేజీపై ఉద్వేగభరితంగా స్పీచ్ ఇవ్వగలిగే పవన్ కళ్యాణ్,  కొన్ని సీరియస్ విషయాల్లో మాత్రం డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు.  ఇదే ఆ పార్టీకి మైనస్ గా మారింది.  ఆర్టీసీ సమ్మె విషయంలో అన్ని పార్టీల నేతలు రోడ్డుపైకి వచ్చి కార్మికులతో పాటు ధర్నా చేశారు.  పవన్ మాత్రం దీనికి దూరంగా ఉన్నారు.  కార్మికులకు మద్దతు తెలిపారుగాని, కార్మికులతో కలిసి రోడ్డుపైకి వెళ్లి ధర్నా చేయలేదు.  


కారణం ఏంటో తెలియదు.  నవంబర్ 3 వ తేదీన వైజాగ్ లో లాంగ్ మార్చ్ చేస్తున్నారు.  వైజాగ్ లో లాంగ్ మార్చ్ చేయడం వలన ఉపయోగం ఏంటో తెలియడం లేదు.  భవన నిర్మాణ బాధితుల కోసం విశాఖలో లాంగ్ మార్చ్ చేయడం కంటే.. విజయవాడలో చేయడం మంచిది కదా.  ఎందుకంటే, రాజధానిలో ఇలాంటి కార్యక్రమాలు తలపెడితేనే దాని వలన ఉపయోగం ఉంటుంది.  ఎక్కడో మారుమూల చేస్తే ఉపయోగం ఏముంటుంది.  అలానే ఆర్టీసీ కార్మికుల విషయంలో పవన్ రోడ్డుపైకి వచ్చి ఉంటె.. దానివలన కార్మికుల సమ్మె మరింత ఉదృతంగా ఉండేది. రాజకీయాల్లోకి వచ్చి చాలాకాలం అయినా పవన్ పై ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అంటే పవన్ సేఫ్ జోన్ లో ఉండి పోరాటం చేస్తున్నాడని అర్ధం చేసుకోవచ్చు.  ఇది ఎంతవరకు కరెక్ట్.  


మరింత సమాచారం తెలుసుకోండి: