తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 27వ రోజుకు చేరుకుంది. ఓవైపు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని... పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు అంతేకాకుండా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆర్టీసీ విషయంలో వివిధ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తుంది ప్రభుత్వం. ఆర్టీసీలో కీలక నిర్ణయాలు తీసుకుంటంతో పాటు పలు  కీలక మార్పులు చేస్తామని ఇప్పటికే కేసీఆర్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ మాటలను బట్టి చూస్తే ఆర్టీసీలో కీలకమైన సంస్కరణలకు  కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టుబోతున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆర్టీసీ లో  30 శాతం అద్దె  బస్సులు 20 శాతం ప్రైవేటు బస్సులు ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 



 కాగా  ఆర్టీసీ లో  నూతన సంస్కరణలు తీసుకు వచ్చేందుకు భావిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ఆర్టిసి మూడు ముక్కలు చేయాలని ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తున్నట్లు  సమాచారం . జిహెచ్ఎంసి పరిధిని  ఒక భాగంగా... మిగిలిన  ఇతర కార్పోరేషన్లు కొన్ని జిల్లా కేంద్రాలకు కలిపి మరో భాగంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం  . ఇక మిగిలిన గ్రామీణ ప్రాంతాలనానికి  కలిపి గ్రామీణ రవాణా సంస్థగా మరో భాగంగా విడదీసేందుకు  ప్రతిపాదన తీసుకు వస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే పలుచోట్ల ప్రైవేటీకరణ అద్దె బస్సులు ఏర్పాటు అంశాల్లో  కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేసీఆర్ సర్కార్  యోచిస్తోందని  సమాచారం. అంతేకాకుండా ఆర్టీసీ ని  మూడు భాగాలుగా విభజించడం వల్ల... ఈ మూడు భాగాల మధ్య పోటీ ఏర్పడి ఆర్టీసీకి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉందని తెరాస ప్రభుత్వం  భావిస్తున్నట్లు  సమాచారం. 



 నూతన ప్రతిపాదనలో సంస్కరణలను ఈ నెల 2న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి కేసీఆర్   కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని  రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అటు కార్మికులు మాత్రం రోజురోజుకీ సమ్మెను ఉధృతం చేస్తూ... ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను పట్టించుకోకుండా ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో నవంబర్ 2 న  జరగబోయే క్యాబినెట్ మీటింగ్ లో  ఆర్టీసీ పై  కెసిఆర్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి  మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: