ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ మహారాష్ట్ర లో శివసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందా, బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందా అన్న ప్రశ్న గత 10 రోజులుగా తలెత్తుతుంది. రెండు రోజుల్లో శివ సేన పార్టీ లీడర్ సంజయ్ రౌత్ గవర్నర్ ని కలిసి బీజేపీ పార్టీ ని తొందరగా మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరతానని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 


ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ శివసేన పార్టీ కలిసి 161 సీట్లు గెలిచారు. మహారాష్ట్ర లో మొత్తం ఉన్నవి 288 సీట్లు. ఈ మధ్య సమయంలో శివసేన పార్టీ లీడర్ ఎన్సీపీ లీడర్ అయినా అజిత్ పవర్ కి సందేశం పంపినట్లు రిపోర్టర్స్ బయటపెట్టారు. ఆ సందేశం ఇలా రాసి ఉంది.. "నమస్కారం, నేను సంజయ్ రౌత్. జై మహారాష్ట్ర. " దీనిపై అజిత్ పవర్ స్పందిస్తూ, ' దీని అర్ధం నేను సంజయ్ కు ఫోన్ చేయాలి. కాల్ చేసి ఏంటో కనుకుంటా" అని అన్నారు. 


శివసేన లీడర్ అయినా సంజయ్ సీనియర్ ఎన్సీపీ లీడర్ అజిత్ పవర్ కి మెసేజ్ చేయడం, కాంగ్రెస్ ఎన్సీపి తో కలిసి గవర్నమెంట్ ని ఏర్పాటు చేస్తారేమో అన్న అనుమానాలు దృఢంచేస్తున్నాయి. నవంబర్ 6, 7 లోపు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆర్థికశాఖ మంత్రి సుధీర్ ముంగటివార్ చెప్పారు. ముఖ్యమంత్రి అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోడానికి బీజేపీ ఒప్పుకోకపోతే మేం వేరే ప్రత్యామ్నాయాలను చూసుకుంటాం అని శివసేన బేషరతుగా వెల్లడించింది.

శివసేన తమకు 170 మంది ఎమ్మెల్యే ల మద్దతు ఉందనడం పలు చర్చలకు దారి తీసింది. ఎందుకంటే బీజేపీ శివసేన ఎమ్మెల్యేలు మొత్తం 161 మాత్రమే కానీ 170 మంది మద్దతు ఉందంటున్నారంటే ఎన్సీపీ లోని ఎమ్మెల్యే తో చెయ్యి కలిపిందేమో అన్న అనుమానాలకు తెరలేపుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: