తెలంగాణ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సంస్థకు వస్తున్న నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమ డిమాండులు నెరవేర్చాలని ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె 31 వ రోజుకు చేరుకుంది. గత నెల రోజులుగా ఆర్టీసీకి రోజుకు సుమారుగా ప్రతి రోజు రూ 4 కోట్లకు పైగా నష్టం వస్తున్నట్లు తెలుస్తోంది అసలే నష్టాల్లో వున్న ఆర్టీసీకి ఈ సమ్మె ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగిస్తోంది. 


ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం లో తెలంగాణ సీఎం కెసిఆర్ ఆర్టీసి నష్టాలపై కేంద్రానికి లేఖ రూపంలో తెలపాలని రవాణా మంత్రి మరియు రవాణా శాఖ అధికారులకు సూచించారు. కేంద్రానికి ఆర్టీసి లో 31% శాతం వాటా ఉన్న నేపథ్యంలో ఆ మేరకు నష్టాలను కేంద్రం భరించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ ద్వారా కేంద్రాన్ని కోరనున్నారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీకి ఇప్పటికే మంత్రి అజయ్‌కుమార్‌, ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ ఒక దఫా లేఖలు రాసిన విషయం తెలిసిందే కానీ ఈ లేఖ కు స్పందన కేంద్రం నుంచి ప్రభుతానికి రాలేదు.


మరోవైపు ఆర్టీసీ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులు గురువారం హైకోర్టుకు హజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా వచ్చిన నష్టాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హైకోర్టు కు తెలపాలని నిర్ణయంచారు. తెలంగాణ ఆర్టీసి ఐకాస ప్రభుత్వ వైఖరిని దుయ్యపట్టింది తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఐకాస పేర్కొంది.

ఆర్టీసి కార్మికులకి తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు నేటితో పూర్తి కానుంది కానీ కేవలం 11 మంది  ఆర్టీసి కార్మికులు మాత్రమే విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ లేఖ పై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: