ఆర్టీసీ కార్మికుల సమ్మె గత 32 రోజులుగా జరుగుతున్నది.  ఈ సమ్మె కారణంగా తెలంగాణలో ప్రజా రవాణ ఎక్కడికక్కడా స్తంభించిపోయింది.  32 రోజులుగా ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.  ప్రభుత్వం కూడా ఈ విషయంలో నాంచివేత వైఖరిని ప్రదర్శిస్తోంది.  ఈరోజు అర్ధరాత్రితో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రావాలని, ఒకవేళ విధుల్లో చేరకపోతే.. రేపటి నుంచి వారిని విధుల నుంచి తొలగించాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది.  అయితే, డెడ్ లైన్లు పెట్టినా విధుల్లోకి చేరే విషయంలో ఆర్టీసీ కార్మికులు ఒకే మాటపై ఉన్నారని, విధుల్లోకి రావడం జరగదని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు.  


కార్మికులు, ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది.  కార్మికులు సమ్మె సమయంలో ఇచ్చిన 26 డిమాండ్లు నెరవేర్చేలా చూడాలని, వాటిపై చర్చలకు పిలిచేవరకు సమ్మె విరమించేది లేదని అంటున్నారు.  ఇదిలా ఉంటె నవంబర్ 7 వ తేదీన సమ్మె విషయంలో హైకోర్టు తీర్పు చెప్పబోతున్నది.  ఈ తీర్పును బట్టి కార్మికులు నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు.  ఒకవేళ తీర్పు కార్మికులకు అనుకూలంగా ఉంటె ప్రభుత్వం ఏం చేయబోతున్నది.  ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది తెలియాలి.  


లేదా ఆర్టీసీకి అనుకూలంగా లేకుంటే.. కార్మికులు ఈ విషయంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని చూస్తున్నారు.  ఒకవేళ సుప్రీం కోర్టుకు వెళ్తే.. అక్కడ పరిష్కారం కావడానికి చాలా సమయం పడుతుంది.  కాబట్టి ఆర్టీసీకి సంబంధించిన పనులను చక్కబెట్టుకోవచ్చు అన్నది కెసిఆర్ ఆలోచన.  అందుకే ఈరోజుతో డెడ్ లైన్ విధించాడు.  డెడ్ లైన్ లోపు కార్మికులు విధుల్లోకి రావాలని హుకుం జారీ చేశారు.  గత 32 రోజులుగా కార్మికులు రోడ్డుబాట పట్టిన సంగతి తెలిసిందే.  కార్మికులు ఎవరు కూడా విధుల్లో చేరడం లేదని, విధుల్లో చేరేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది.  భయపడాల్సిన అవసరం లేదని, తీర్పు కార్మికులకు అనుకూలంగానే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: