మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి.  మహాప్రభుత్వం గడువు నవంబర్ 8 వ తేదీతో ముగియడంతో నవంబర్ 7 వ తేదీన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు.  కాగా, అయన ప్రస్తుతం తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.  కాగా, అధికారాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీని గవర్నర్ ఆహ్వానించారు.  ఈ ఆహ్వానాన్ని బీజేపీ అంగీకరించింది.  


కాగా, రేపు బలనిరూపణ చేసుకోవాలని ఫడ్నవిస్ కు గవర్నర్ గడువు ఇవ్వడంతో.. మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారింది.  సోమవారం రోజున బీజేపీ ఎలా బలనిరూపణ చేసుకుంటుందో చూడాలి.  బీజేపీ బలం ప్రస్తుతం 105 ఉన్నది.  పార్టీ అధికారంలో ఉండాలి అంటే ఆ పార్టీకి ఇంకా 40 మంది మద్దతు అవసరం.  40 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలి అంటే మాములు విషయం కాదు.  అది జరుగుతుందా అన్నది చూడాలి.  


అయితే, శివసేన, బీజేపీ కలిసి ఉన్నట్టయితే ఈపాటికి ఎప్పుడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది.  కానీ, శివసేన ముఖ్యమంత్రి పీఠం కావాలని మెలిక పెట్టడంతో.. బీజేపీ ఒప్పుకోలేదు.  దీంతో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.  ఎప్పుడైతే రెండు పార్టీల మధ్య రగడ మొదలైందో అప్పటి నుంచే శివసేన విమర్శలు చేయడం ఎక్కువ చేసింది.  రెండు పార్టీల మధ్య ఎలాగైనా గ్యాప్ పెరిగింది.  మాటల యుద్ధం తరువాత ఇప్పుడు రెండు పార్టీలు విడిపోయినట్టుగానే కనిపిస్తున్నాయి.  


బీజేపీ ని ఆహ్వానించడంతో శివసేన సైలెంట్ గా ఉన్నది.  తమ మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కుదరదని, ఎలా నిలుస్తుందో చూస్తామని అంటున్నారు.  అటు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం కోసం పావులు కడుపుతున్నది.  కాంగ్రెస్ పార్టీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాలని అంటోంది.  తాము కూడా ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటోంది.  మరోవైపు శివసేన కూడా కాంగ్రెస్ విషయంలో మెత్తబడింది.  కాంగ్రెస్ పార్టీ అంటరాని పార్టీ కాదని, అవసరమైతే కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని అంటోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: