వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా పధకాలు ప్రవేశపెడుతూ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎంత నష్టం వచ్చినా సరే వాటిని నెరవేర్చడంలో జగన్ అందరికంటే ముందు ఉంటున్నారు.  ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే పధకాలు నెరవేర్చాలని ఇప్పటికే జగన్ అనేకమార్లు అధికారులకు చెప్పారు.  
ఇప్పటికే ఎన్నో అవాంతరాలు దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు.  ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన తరువాత మొదటిసారి పింఛన్ పధకంపై సంతకం చేశారు.  ఆ తరువాత గ్రామవాలంటీర్లను నియమించడం, గ్రామసచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తోపాటుగా రైతులకు రైతు భరోసా పధకం ద్వారా ఆదుకుంటున్నారు.  ఇవే కాదు ఇంకా ఎన్నో పధకాలు ప్రవేశపెట్టిన జగన్, వాటి అమలు విషయంలో కూడా శ్రద్ధ చూపిస్తున్నారు.  
ఇకపోతే, జగన్ సర్కార్ ఇప్పుడు మరలా మరో కొత్త విధానానికి తెరతీసింది.  ప్రభుత్వ పధకాలు అందాలి అంటే రేషన్ కార్డులు ఉండాలి.  రేషన్ కార్డులు ఉన్న వ్యక్తులకే కొన్ని పధకాలు అందుతాయి.  మరికొందరికి ఈ పధకం అందుబాటులో ఉండటం లేదు.  అందుకోసమే అందరికి అందుబాటులో ఉండే విధంగా పధకాలు అమలు చేయడానికి ప్రభుత్వం ఓ నూతన విధానం తీసుకొస్తున్నది.  
అదేమంటే, ఒక్కో పధకానికి ఒక్కోరకమైన గుర్తింపు కార్డును ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  ఒక్కో పధకానికి ఒక్కో గుర్తింపు కార్డు ఇవ్వడం వలన ఏ పధకం అములు జరిగితే ఆ పధకానికి సంబంధించిన కార్డును వినియోగించుకోవచ్చు.  ఫలితంగా పధకం ఎంతవరకు అమలు జరిగింది అని తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.  అందుకోసమే ఈ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది జగన్ సర్కార్.  దీనికి ఈరోజు జరుగుతున్న కేబినెట్ మీటింగ్ లో ఆమోద్ర ముద్ర వేయబోతున్నారు.  ఈ పధకానికి ఆమోదముద్ర వేయడం ద్వారా ప్రతి ఒక్కరికి పధకాలు పారదర్శకంగా అందుతాయని ప్రభుత్వం ఆలోచన. 

మరింత సమాచారం తెలుసుకోండి: