తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మీటింగ్ నేడు (నవంబర్ 28) మరియు రేపు జరగనుంది, ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది "తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నవంబర్ 28 న జరగనుంది, ప్రధానంగా ఆర్టీసి అంశంపై చర్చించే అవకాశం ఉంది, అవసరం అయితే నవంబర్ 29 న కూడా మంత్రివర్గ సమావేశం జరుగుతుంది" అంటూ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కెసిఆర్ ఆర్టీసి ఉద్యోగుల పై ఏ నిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

ఆర్టీసి ప్రైవేటీకరణ కు కేంద్రం నో 

 

నిన్న (నవంబర్ 27) న కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ కి తెలంగాణ సీఎం కెసిఆర్ ఆర్టీసి స్థితిని తెలియజేసినట్లు సమాచారం. సీఎం కెసిఆర్ ఆర్టీసి పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిందని కేంద్ర సాయం అవసరం అని తెలుపగా గడ్కరీ స్పందించలేదని తెలుస్తోంది. ఇక ఆర్టీసి ప్రైవేటీకరణ చేయాలంటే కేంద్ర అనుమతి తప్పనిసరి కావడంతో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం అయితే నితిన్ గడ్కరీ మాత్రం ఆర్టీసి ప్రైవేటీకరణకు నో చెప్పారని తెలుస్తోంది.

 

కేబినెట్ మీటింగ్ లో ఆర్టీసి ఉద్యోగుల పై సంచలన నిర్ణయం? 

 

ఆర్టీసి కార్మికులు విధుల్లో చేరుతామని చెప్పిన ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసి ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఆర్టీసి ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం కానీ విధుల్లో చేరేముందు కొన్ని షరతులు విధించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక భవిష్యత్ లో ఆర్టీసి లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవ్వదని సమాచారం. ఆర్టీసీలో శాశ్వత ఉద్యోగాలకు స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. వీటి అన్నింటిపై ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని కేబినెట్ ఆమోదమే తరువాయి అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

 

5100 రూట్ల ప్రైవేటీకరణకు పచ్చజెండా 

 

హైకోర్టు 5100 రూట్ల ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపడంతో ఏయే రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పజెప్పాలని సమీక్ష నిర్వహించారు. ఆర్టీసి లో అధిక భాగం నష్టాలు గ్రామీణ ప్రాంత సర్వీసుల్లోనే వస్తుందని ఒక అవగాహనకు వచ్చిన అధికారులు సీఎం కు తెలిజేయగా పల్లెవెలుగు బస్సుల స్థానంలో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: