52 రోజులపాటు చేసిన సమ్మె ఫలించకపోయినా.. చివర్లో కార్మికులు పెట్టుకున్న కన్నీళ్లు ఫలించాయి.  పొలిటికల్ హైడ్రామాలా నడిచిన కార్మికుల విధుల విషయం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది.  48 వేలమంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.  వారికీ ఎలాంటి షరతులు పెట్టకుండా అందరిని విధుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.  ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్ తరువాత కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  
రేపటి నుంచి అందరు విధుల్లోకి రావాలని కోరారు.  అంతేకాదు ఆర్టీసీకి తక్షణ సహాయం కింద రూ. 100 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.  ఈ ప్రకటనతో కార్మికుల గుండెల్లో పాలుపోయిన వ్యక్తి అయ్యాడు.  అంతేకాదు, సోమవారం నుంచి కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున చార్జులు పెంచబోతున్నట్టు కెసిఆర్ తెలిపారు.  ఈ అధికారం ఆర్టీసీ ఎండికి ఇస్తున్నట్టుగా చెప్పారు.  ఇలా ఇప్పుడు కార్మికులకు అవకాశం ఇవ్వడంతో కార్మికులంతా పండుగ చేసుకుంటున్నారు.  
రేపటి నుంచి బస్సులు తిరిగి తిరగబోతున్నాయి.  కేంద్రానికి 30శాతం వాటా ఉన్నది కాబట్టి కేంద్రం నుంచి రూ. 21 వేల కోట్లు రావాలని కెసిఆర్ పేర్కొన్నారు.  ప్రతిపక్షాలు, యూనియన్ల మాటలు వినొద్దని అయన చెప్పారు.  కార్మికులకు ఎప్పుడు ఎలాంటి అవసరాలు ఉంటాయో, వాటిని ఎలా ఇవ్వాలో ప్రభుత్వానికి తెలుసునని కెసిఆర్ పేర్కొన్నారు.  అంతేకాదు, ఇప్పటి వరకు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పిన ఆర్టీసీని ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొన్నారు.  
ప్రైవేట్ పరం చేస్తామని అప్పట్లో చెప్పిన అవసరం వేరు అని, కానీ, ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు వేరు అని అన్నారు.  సమ్మె సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని కెసిఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  52 రోజులు పాటు చేసిన సమ్మె వేరుగా ఉన్నా.. చివర్లో కార్మికులకు కెసిఆర్ షాక్ ఇచ్చి.. ఆ తరువాత కొన్నిరోజులు ఏడిపించి చివరకు కార్మికులకు ఉపశమనం కలిగించే మాట చెప్పి వారందరి మనస్సులో, 50వేల కుటుంబాల్లో కెసిఆర్ దేవుడు అయ్యాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: