‘‘యూనియన్లది ఉన్మాదం, ఈ రియలైజేషన్ రావాలి కాబట్టే కఠినంగా వ్యవహరించాం, యూనియన్లతో మాట్లాడేదే లేదు, కార్మికుల బతుకుల్ని బజార్ల వేసింది వాళ్లే… కార్మికుల మరణాలకు కారకులు వాళ్లే… ఇక యూనియన్లు ఉండవు… డిపోల వారీగా వెల్ఫేర్ కౌన్సిళ్లు వేస్తాం…’’ ఇవీ తాజాగా జరిగిన కాబినెట్ సమావేశ అనంతరం మీడియా సమావేశంలో ఆర్టీసీపై కేసీయార్ చేసిన వ్యాఖ్యలు… అయితే ప్రజలు మాత్రం ఈ వాక్యాలుపై మీద తీవ్ర వ్యతిరేకతను తెలుపుతున్నారు. కెసిఆర్ మాటల్లో పూర్తిగా డొల్ల ఉంది అంటూ అనేకమంది మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి నేతను ఎక్కడ చూడలేదు అంటూ మరొకరు అంటున్నారు.


విచారకరమైన విషయమేమిటంటే... సంఘాలు మీకు వద్దు అని చెప్పడానికి.. దాదాపు యాభై రెండు రోజుల వరకు సమ్మెను వాయిదా వేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. 52 రోజుల వ్యవధిలో... ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మరణాలు సంభవించాయి. తాత్కాలిక డ్రైవర్ల వలన యాక్సిడెంట్ జరిగి సామాన్య ప్రజలు వారి జీవితాన్ని కోల్పోయారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేటప్పుడు.. "మీ బతుకులు మీకే తెలియాలి.. మీ ఆర్టీసీ సంస్థ ఖతం.. మీ ఆర్టీసీ సంస్థ ముగియనున్నది. ఇదే జరుగుతుంది. ఆర్టీసీ సంస్థను ఎవరు కాపాడలేరు. వారి బతుకులెట్లా అనే సంగతి వారికే తెలియాలి!" అని అన్నాడు. ఇప్పుడేమో ఆర్టీసీ కార్మికులు నా బిడ్డలు..  మన తెలంగాణ బిడ్డలు.. అంటున్నాడు. మరి మీ బిడ్డలు చనిపోతుంటే వాళ్ల మీద అంత కఠినంగా ఎందుకు ప్రవర్తించారంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.

దానికి కేసీఆర్.. ఒక సమర్థతను ఇచ్చాడు.. ఆర్టీసీని డిసిప్లిన్ లోకి తేవడానికి.. ఇంత కఠినంగా వ్యవహరించాం...అంటాడు.. దీనికి సాధారణ ప్రజలు మాత్రం.. కేవలం డిసిప్లెన్ కోసం కొంత మంది కార్మికుల ప్రాణాలు పోతే పోయాయని ఇంత కఠినంగా ఉండటం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.


జీతాలు రాక పోయినా, ఆకలితో అలమటిస్తున్నా, తమ సహోద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, పోలీసులు లాఠీఛార్జి తమపై చేస్తున్నా, కార్మికులు మాత్రం యూనియన్ల మాటలే విన్నారు, వారితోనే ఉన్నారు. కేసీఆర్ విధుల్లోకి చేరకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పినప్పటికీ... పట్టుమని వందమంది కార్మికులు కూడా చేరలేదు... మీ బతుకుల సంగతి ఇక అంతే అని, ఆర్టీసీ అమ్మేస్తామని పరోక్షంగా వార్తలు రాస్తూ చెప్పినప్పటికీ.. కార్మికులు మాత్రం యూనియన్ల దగ్గర పర్మిషన్ తోనే... విధుల్లోకి చేరతామని నిరసనలు చేశారు.

దీనికి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అంటే... కార్మికులలో అభద్రతను నింపింది కేవలం ప్రభుత్వ మాటలు, చేతలేనని... నిజానికి ప్రతి ఒక్క సంస్థల్లో, ఫ్యాక్టరీలలో యూనియన్ల తప్పనిసరిగా ఉంటారు. ఫ్యాక్టరీ యజమానులు ఏదేదో చెబుతుంటారు.. కానీ కార్మికులు మాత్రం యూనియన్లను నమ్ముతారు. ఇదేవిధంగా ఆర్టీసీ కార్మికులు కూడా తమ యూనియన్లను నమ్మారు. ఇది సాధారణమైన విషయం.. ఇంకా నమ్మడమనేది సహజం.

అయితే ఒక సగటు సాధారణమైన మనిషికి వచ్చే ప్రశ్నలు ఏంటంటే...

1. ఆర్టీసీ కార్మికులు ఇవ్వడానికి నా దగ్గర రూపాయి బిళ్ళ కూడా లేదు అన్న కేసీఆర్... ఇప్పుడు వెంటనే 100 కోట్లను కేటాయిస్తామని ఎలా చెప్పాడు?

2.అప్పుడేమో ఆర్టీసీ నష్టాల్లో ఉంది.. ఆర్టీసీని యధావిధిగా కొనసాగిస్తే కొన్ని కోట్ల నష్టం వస్తుందని చెప్పాడు. ఇప్పుడేమో ఆర్టీసీ సంస్థను బాగు చేస్తాం, కాపాడుతాం... ఇందుకుగాను మా దగ్గర ఒక పరిష్కారం ఉంది.. కిలోమీటర్కి చొప్పున 20 పైసలను పెంచుతాం అని చెప్పాడు. ఆర్టీసీని ఉద్దరించటానికి చార్జీల పెంపు అనే తారకమంత్రం ఉన్నప్పుడు ఇంత గోస దేనికి పెట్టినట్టు..? ఆ బాదుడేమిటో ముందే జనాన్ని బాదితే సరిపోయేది కదా… చార్జీయేతర ఆదాయం ఎలా పెంచుకోవచ్చు అనేది ఈ ప్రభుత్వానికి తెలియదు, పట్టదు అని మరోసారి నిరూపితమైంది…

3. హైకోర్టు చాలా రోజుల వరకు వాయిదా వేస్తూ చివరికి...'కార్మికుల హత్యకు ప్రభుత్వం ఎలా బాధ్యత అవుతుంది?? యూనియన్ లే/ సంఘాలే కదా సమ్మెకు పిలిచింది' అంటూ వ్యాఖ్యానించడం ప్రజలకు రుచించట్లేదు.

4. కొంతమంది.. సాధారణ మనుషులు ఎలా ఆలోచిస్తున్నారంటే.. యూనియన్లు సమ్మెలు చేయడం వలనే ఇదంతా జరిగింది.. వాళ్లదే బాధ్యత అంటున్నారు.. కానీ మరికొందరు... 'మరి ఇన్నేళ్లూ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిని పెంచిందెవరు..? తను ఎవరి మనిషి..? తనే భస్మాసురుడు అయితే, టార్గెట్ చేయాల్సింది తనను… అంతే తప్ప సంస్థను, ప్రజారవాణాను, వేల మంది కార్మికులను కాదు కదా..' అని అంటున్నారు.

4. ఇక్కడ కార్మికులు గెలిచారా? లేక ప్రభుత్వం గెలిచిందా అనేది ప్రశ్న కాదు... ఒక ఫ్యాక్టరీకి.. కార్మికుల మధ్య.. సమ్మెలు, చర్చలు, డిమాండ్లు ఉండటం సహజం. అయితే 50 వేల కార్మికులు ఉన్న ఆర్టీసీ సంస్థ యొక్క సమ్మె విషయంలో ప్రభుత్వం చాలా క్రూరంగా ప్రవర్తించింది కానీ.. సున్నితంగా అసలు అడుగులు వేసిన దాఖలాలు లేవు.

5. "అంతిమంగా జరిగింది ఏంటి ఇప్పుడు?? మా జేబులకు బొక్క పడటం తప్ప!" అంటూ ప్రజలు స్పందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: