టిఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత సీనియర్ నేత ఎవరంటే కచ్చితంగా కే కేశవరావు పేరు  వస్తుంది. ప్రస్తుతం ఉన్న కేశవరావు రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగిస్తుంది. కానీ ఇప్పుడు దాన్ని కెసిఆర్ తిరిగి పునరుద్ధరించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కేశవరావు సేవలను ప్రభుత్వంలో వినియోగించుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు అనుకుంటున్నారు. త్వరలో తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.

 

ఇందులో కేశవరావు ది ఒకటి, రెండవది కాంగ్రెస్ఎంఏ. ఖాన్. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో ఈ సీటు కూడా టిఆర్ఎస్ వశం అవుతుంది. దీంతో ఈ రెండు సీట్లలో టిఆర్ఎస్ నేత వినోద్ పాటు తన సొంత కూతురు కవిత కూడా అవకాశం ఇవ్వనున్నట్లు  తెలుస్తుంది. కేశవరావు తీరుతో కెసిఆర్ ఈ మధ్య చాలా ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ సమ్మె విషయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తారు అని చెప్పి కేసీఆర్ ను ఇబ్బందుల్లో పెట్టారు కేశవరావు. అలాగే కొన్ని విషయాలలో టిఆర్ఎస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నిలబడ్డారు ఆయన. కానీ దీనిపై కేశవరావు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒక సీనియర్ ని కాకుండా వేరే వాళ్లను రాజ్యసభకు పంపితే కచ్చితంగా రాజకీయ అలజడులు  వస్తాయి.

 

ఇక కొన్ని వివాదాల్లోనూ కేకే తీరు కేసీఆర్ కు వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాడట దీంతో కేకేకు రాజ్యసభ రెన్యువల్ కాదనే చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. కేకేను ఎమ్మెల్సీని చేసి మండలికి పంపిస్తారని.. కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవి ఇచ్చి రాష్ట్ర రాజకీయాలకు వాడుతారనే వాదన వినిపిస్తోంది.

 

మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గంలో ఓడిపోయిన సొంత కూతురు కవిత కి, ఏదో ఒక పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఇలా చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా గులాబీ వర్గంలో చర్చకు దారితీస్తున్నాయి. చూడాలి మరి కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: