అసెంబ్లీ సమావేశాల చివరి రోజున మూడు రాజధానుల గురించి జగన్ ప్రకటించినప్పటి నుండి అమరావతి ప్రాంతంలో ఆందోళనలతో నిరసనలతో హోరెత్తి ఇస్తున్నారు వరుసగా రైతుల ఆందోళన ఏడవ రోజుకు చేరుకుంది జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రతిపక్ష పార్టీలు సైతం జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 

ముఖ్యంగా టిడిపి మాత్రం ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే అని రాజధాని రైతులకు బాసటగా పోరాడుతూ ఉంటే జనసేన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది అభివృద్ధి వికేంద్రీకరణ ఓకే కానీ రాజధాని వికేంద్రీకరణ అవసరం లేదంటూ మాట్లాడుతూ ఉన్నారు ఈ తరుణంలో రాజధాని విషయంలో సీఎం జగన్ మంత్రివర్గ భేటీ నిర్వహించి తుది ప్రకటన విడుదల చేయాలని భావిస్తున్నారు .

 


 అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనకు అనుకూలంగానే జిఎం రావు కమిటీ నివేదిక రావడంతో ఒక విషయం పూర్తిగా అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇక ఈ కమిటీ నివేదిక పై డిసెంబర్ 27న క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి బొత్స ప్రకటించారు  ఇదే దిశగానే వైజాగ్లో నిర్వహించడానికి ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలిసింది ఎందుకంటే మూడు రాజధానుల విషయంలో జగన్ చేసిన ప్రకటనపై ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులు కోపంతో ఉన్నారు. ఈ మీటింగ్ రాజధాని ప్రాంతంలో జరిగితే రాజధాని ప్రాంత రైతుల సెగ తగులుతోంది భావనతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది .

 

అంతేకాక ఒక పక్క ప్రతిపక్ష పార్టీ టిడిపి నేతలు అమరావతి రైతులకు మద్దతుగా పోరాటం సాగిస్తున్న వేళ విశాఖపట్టణంలో ఈ మీటింగ్ పెట్టడం వల్ల టిడిపి కి చెక్ పెట్టొచ్చు కానీ ఉత్తరాంధ్ర ప్రాంత టిడిపి నాయకులు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అందువల్ల అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంత్రి మండలి భేటీ అవ్వచ్చు అని తెలుస్తోంది మరోవైపు ఈ క్యాబినెట్ సమావేశం తర్వాత సీఎం జగన్ ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను ప్రకటించి సూచనలు ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: