ఇంటర్ నెట్లో అప్రమత్తగా లేకపోతే.. మన జేబులు గుల్లవుతూనే ఉంటాయి. సైబర్ నేరగాళ్లు కొత్త పద్దతుల్లో జనాలను మోసం చేస్తున్నారు. అలాంటి సంఘటనే ఇది. ఉద్యోగాల కోసం ఎదురు చూసే కుర్రాళ్లను ఆకర్షించి వారి జేబులు గుల్ల చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు.

 

ఒక వీడియో లింక్ కనిపించిందని.. వెంటనే ఓపెన్ చేసి బాగుండటంతో లైక్ కొట్టాడు. అదే అతడి కొంప ముంచింది. పార్ట్ టైమ్ జాబ్ పేరిట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2.04 లక్షలు కొల్లగొటారు. కొన్ని నెలల కిందట ఆ యువకుడు లైకీ మొబైల్ అప్లికేషన్లో 'యునైట్ లవ్ అనే వీడియో లింక్ కనిపించడంతో ఓపెన్ చేశాడు. ఆ వీడియో నచ్చడంతో లైక్ కొట్టాడు.

 

అంతే .. గతేడాది నవంబర్ 1988178 56348 నంబర్ నుంచి ఓ కాల్ వచ్చింది. యునైటీ ఎగ్జిక్యూటివ్ నంటూ నేహ అనే మహిళ హిందీలో మాట్లాడి పరిచయం చేసుకుంది. మా సంస తరపున పార్ట్ టైం జాం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని, జీతం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వస్తుందంటూ వివరించింది.

 

అక్కడే మనోడు పడిపోయాడు. ముందుగా రూ. 10 వేలు రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలంటూ సూచించింది. ఈ డబ్బులను ఎస్ బీఐ ఖాతాలో జమ చేయమంటూ వివరాలిచ్చింది. గూగుల్ పే ద్వారా ఆమె చెప్పి నట్లుగానే రూ.10వేలు బాధితుడు చెల్లించాడు. గతేడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 9 వరకు పలుదఫాలుగా వేస్తూనే ఉన్నాడు. మొత్తం 2 లక్షలు చెల్లించాడు.

 

ఆ తరవాత అనుమానం వచ్చింది తాను మోసపోయాయనని.. భువనగిరికి చెందిన ఆ కుర్రాడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. అందుకే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.. అట్రాక్ట్ చేసే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి: