పోతురెడ్డి పాడు విషయంలో కుట్రలు జరుగుతున్నాయని  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత  నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ , రంగారెడ్డి , నల్గొండ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత  నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు...తెలంగాణ పై ప్రభావంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేసంలో  టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం.. ఏ ఐ సిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ,టీడీపీ రావుల చంద్ర శేఖర్ , రిటైర్డ్  ఇంజినీర్లు, సామజిక కార్యకర్తలు పాల్గొన్నారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  కాంగ్రెస్ హయాంలోనే నాలుగు ప్రాజెక్ట్స్ ప్రారంభమయ్యాయని చెప్పారు.

ఆ ప్రాజెక్ట్ లన్నీ పక్కన పెట్టారన్నారు.  వాటిని కొనసాగించి ఉంటే  8 లక్షల ఎకరాలు సాగయ్యే పరిస్థితి ఏర్పడేదని నాగం చెప్పారు. కృష్ణ పరివాహక ప్రాంతాల్లో ఒక్క ప్రాజెక్టు అయిన కట్టావా కెసిఆర్ అని సూటిగా ప్రశ్నించారు. జగన్ తో సీఎం కెసిఆర్ కుమ్మక్కయ్యారు . రాయలసీమ వెళ్లి రత్నాల సీమని చేస్తానని కెసిఆర్ చెప్పాడు. చెరువుల్ని నింపి కెసిఆర్ ఛంక్కలు గుద్దుకుంటున్నాడు.అసెంబ్లీ సాక్షిగా నీళ్ళు తీసుకెళతానని సీఎం  జగన్ మాట్లాడితే కెసిఆర్ ఎందుకు స్పందించలేదు. జగన్ పాలనా భేష్ అని కేటీఆర్ చెపుతాడు. కృష్ణ జలాలని దోచుకుపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జగన్ ఒక్క టీఎంసీ నీళ్ళని తీసుకెళ్లిన మేము నీ  భరతం పడతామనీ కెసిఆర్ కు అల్టిమేటం జారీచేశారు. 

 ప్రశ్నించే గొంతులు మూలాన పడ్డాయి..

ఇంత చెత్త పలానా నెను ఎక్కడ చూడలేదు ..ఆరు సంవత్సరాల ఈ ప్రభుత్వం గడ్డి పికుంటూ కూర్చుంది ..తెలంగాణ రైతులని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది ..ఈ ప్రభుత్వం పై పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది.కృష్ణా జలాల్ని కాపాడుకోవడానికో అవసరమైతే ఉద్యమించాలన్నారు.  ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ..తెలంగాణ వచ్చిన తరువాత చైతన్యం చచ్చిపోయింది. తెలంగాణాలో బానిస వాతావరణం నెలకొంది. ప్రశ్నించే గొంతులు మూలాన పడ్డాయి. జగన్ మోహన్ రెడ్డి 80 వేల క్యూసెక్ ల నీళ్లు తీసుకెళతాము అంటే ఒక్కరు మాట్లాడలేదు.

తాగు నీళ్లు ఇవ్వమంటే ఊరూరా బెల్ట్ షాప్స్ పెట్టి మందు పోస్తున్నాడు కెసిఆర్ అని విమర్శించారు. నీళ్లు నిధులు నియామకాలు తెచుకున్న రాష్ట్రంలో సమస్యలు తప్ప ఎం లేవు. తెలంగాణ ఎందుకు తెచుకున్నాము అని సమాజం బాధపడుతుందన్నారు. కెసిఆర్ జగన్  చుట్టరికం మధ్య తెలంగాణ ప్రజలని దోచుకుంటాము అంటే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ వచ్చాక జల దోపిడీ జరుగుతుంది. ఇరిగేషన్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు .

కెసిఆర్ మభ్యపెడుతున్నాడు..
ప్రాజెక్టు ల పెరుతో తెలంగాణ ప్రజలని కెసిఆర్ మభ్యపెడుతున్నాడు. కెసిఆర్ ఎస్ 5ఎల్ బీసీ ని ఎందుకు జాప్యం చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదని టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు.   కృష్ణ నదిమీద నిర్మించిన నాలుగు ప్రొజెక్ట్స్ మా ఐక్యమత్యంతో సాధించాము ..ప్రాజెక్ట్ తెగిపోతే ఇసుక దొరుకుతుంది మంత్రులు అంటున్నారు .ఇలాంటి మేధావులు ఉన్న కేబినెట్ ఉంది ..పాలమూరు ఎత్తి పోతల ప్రాజెక్టు డిజైన్ లో లోపం ఉంది అని ఎప్పటి నుండో చెపుతున్నాము .నత్త నడకన ప్రొజెక్ట్స్ పనులు నడుస్తున్నాయి ..ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గా చేస్తామని గాలికి వదిలేసారు ..జగన్ కి కెసిఆర్ కి ఉన్న సంబంధం అందరకి తెలిసింది ..కెసిఆర్ గేమ్ చెంజర్ ..ఎన్నికల ముందు ప్రజలకి పిచ్చర్స్ చూపిస్తున్నాడు. ఇలాంటి అంశాలపైనా అందరు పోరాటం చేయాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: