వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజుల్లో...మంత్రి వర్గం కూర్పు సందర్భంగా సీఎం జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ గుర్తే ఉంటుంది. ఆయన ఒక్కసారే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసి...మళ్ళీ రెండున్నర ఏళ్లలో కొందరిని మంత్రివర్గం నుంచి తప్పించి...ఇప్పుడు అవకాశం దక్కనివారికి అప్పుడు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పారు. అయితే జగన్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావొస్తుంది. ఇక అటు ఇటుగా రెండేళ్లలో జగన్ కేబినెట్ విస్తరణ చెప్పట్టే అవకాశముంది.

 

అయితే అప్పుడు కేబినెట్ విస్తరణలో సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని స్పష్టంగా అర్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ధర్మాన అన్న అయిన ధర్మాన కృష్ణదాస్‌ జగన్ మంతివర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. కృష్ణదాస్ మంత్రిగా ఉన్న తమ్ముడు ప్రసాదరావు అంత దూకుడుగా మాత్రం లేరు. పాలన పరంగా బాగానే ఉన్న...ప్రతిపక్షాలకు చెక్ పెట్టడంలో వెనుకబడే ఉన్నారని చెప్పొచ్చు.

 

ఇదే సమయంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి... నేదురుమల్లి, కోట్ల, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేసిన అనుభవం గల ప్రసాదరావు..2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచి...ప్రభుత్వంలో సీనియర్ నేతగా ఉన్నారు. ఇక ఆయన సీనియారిటీ అసెంబ్లీలో బాగా అర్ధమవుతుంది. అసలు మూడు రాజధానుల అంశాన్ని మొదట అసెంబ్లీలో తీసుకొచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు. ఇక విషయాన్ని సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ...తన యాస, ప్రాసతో ప్రతిపక్షానికి సూపర్ కౌంటర్లు ఇస్తున్నారు.

 

తాజాగా కూడా మంత్రులకంటే జగన్...ధర్మానకే మూడు రాజధానులపైన గానీ, మండలి రద్దు అంశంపై ఎక్కువ మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. దీని బట్టి చూసుకుంటే ధర్మానకు భవిష్యత్‌లో ఎలాంటి అవకాశం ఇస్తారో స్పష్టంగా అర్ధమైపోతుంది. ప్రస్తుత పరిస్తితులని బట్టి చూసుకుంటే జగన్ కేబినెట్‌లో అన్న ఔట్ అయ్యి తమ్ముడు ఇన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: