కరోనా మహమ్మారి రెండు తెలుగు రాష్ట్రాలని వణికిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ పొడిగించి కఠినంగా అమలు చేస్తున్నా, రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 858 కరోనా కేసులు నమోదు కాగా, 651 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. అటు ఏపీలో  722 కేసులు నమోదు కాగా, 610 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి.

 

అయితే కరోనా కట్టడి చేయడంలో ఇద్దరు సీఎంలు గట్టిగానే కష్టపడుతున్నారు. కాకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మీడియా సమావేశం పెట్టి పరిస్థితుల్ని వివరిస్తున్నారు. కానీ ఏపీ సీఎం జగన్ తక్కువ మీడియా సమావేశాలు పెడుతూ, ఎక్కువ సమయం కరోనా కట్టడి చేయడం, లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బందులు వంటి అంశాలపై ప్రతిరోజూ సమీక్ష సమావేశాలు పెట్టి, సమస్యలు తగ్గించడానికి కృషి చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో జగన్ ఫెయిల్ అయ్యారని చెబుతూ, కేసీఆర్ నిర్ణయాలనైనా కాపీ, పేస్ట్ చేయాలని,  కేసీఆర్ కేబినెట్ మీటింగ్ నిర్వహించి సడలింపులు లేని లాక్‌డౌన్‌ను అమలు చేస్తుంటే, జగన్ మాత్రం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సడలింపు ఇచ్చారంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇక్కడ చూసుకుంటే తెలంగాణతో పోలిస్తే ఏపీలో కరోనా కేసులు తక్కువ. 

 

కాకపోతే కేసులు ఎక్కువ, తక్కువ అనే విషయం కాకుండా సీఎం జగన్, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్య సర్వే నిర్వహించారు. ఇంకా కరోనా కేసులు తెలుసుకోవడానికి, మండలాల వారీగా ర్యాండమ్ టెస్టులు చేస్తున్నారు. ఇంకా కరోనా టెస్టులని కూడా పెంచారు. దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లని కూడా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్నారు. అలాగే కరోనా రోగులని, క్వారంటైన్ లో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అటు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకుంటున్నారు.

 

అయితే కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపు రూల్స్ ఏపీలో అమలు చేయడానికి కారణం ఆర్ధిక పరిస్థితి. కరోనా వ్యాప్తి పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే లాక్ డౌన్ సడలింపు రూల్స్ అమలు చేస్తున్నారు. కాబట్టి జగన్ కు ఎవరి నిర్ణయాలు కాపీ,పేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: