భారత దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  దీంతో జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి..అయితే కొంత మంది చేసిన నిర్లక్ష్యానికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.  రహదారులు సరిగా లేకపోవడమో, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడమో, ఆకస్మికంగా జరిగే ప్రమాదాలవల్ల ఎన్నో వేల కుటుంబాలు ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయారు..పోతున్నారు.  ఓ వైపు జాతీయ రహదారులపై ఎన్నో నియమనిబంధనలు సూచిస్తూ..ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..ఫలితాలు మాత్రం శూన్యంగానే ఉన్నాయి. 
Image result for road accident
ప్రతిరోజు ఎన్నో వందల ప్రమాదాలు జరుగుతూ..ప్రాణాలు కోల్పోయి, వికలాంగులుగా మిగులుతున్నారు.  తాజాగా కర్ణాటకలోని  హసన్‌ తాలుకాలోని కరెకేరా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పదిమంది గాయాలపాలైనట్లు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆరె.కె. శహపుర్‌వాద్‌ పేర్కొన్నారు.
Image result for road accident
కెఎస్‌ఆర్‌టిసికి చెందిన బస్సు కరెకెరా జాతీయ రహదారిలో గల బ్రిడ్జిపై నుండి శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు పడిపోయిందని తెలిపారు. ప్రమాదం తీవ్రస్థాయిలో జరగడం వల్ల బస్సు డైవర్‌, కండెక్టర్‌ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని హసన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా, డ్రైవర్‌ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: