ప్రముఖ నటుడు హరికృష్ణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన బావ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు ఎంతగానో ఇష్టమైన  బావమరిది నందమూరి హరికృష్ణ వార్తతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ లో బయల్దేరారు.   ప్రమాద ఘటన తెలియగానే మంత్రి లోకేశ్ తో కలసి ఆయన హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ లో ఘటనాస్థలానికి బయలుదేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. హరికృష్ణ మరణం తమ కుటుంబానికి తీరని లోటని తెలిపారు.
Image result for CHANDRABABU NAIDU HARIKRISHNA
హరికృష్ణ మరణం కేవలం టీడీపీకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సాంఘిక, పౌరాణిక చిత్రాల్లో హరికృష్ణది అందవేసిన చేయి అని సీఎం అన్నారు. సీనీరంగంతో పాటు రాజకీయాల్లోనే హరికృష్ణ సేవలు ఎనలేనివని బాబు కొనియాడారు. చైతన్యరథం నడుపుతూ నందమూరి తారక రామారావును హరికృష్ణ ప్రజల చేరువకు తీసుకెళ్లారని చంద్రబాబు అన్నారు.
Image result for CHANDRABABU NAIDU HARIKRISHNA
  కాగా,  హరికృష్ణ మృత దేహానికి ఇంకా పోస్ట్ మార్టం ప్రారంభంకాలేదు. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు వైద్యులు సిద్ధమైనప్పటికీ... చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో పోస్ట్ మార్టంను వైద్యులు ప్రారంభించలేదు. కాసేపట్లో పోస్ట్ మార్టంను నిర్వహించనున్నారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: