ప్రధాని నరేంద్ర మోడీ, దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోన్న విషయం విదితమే. జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఇలా ఎవర్నీ వదలడం లేదు నరేంద్రమోడీ. 'గాంధీ పేరు మాటున దాగిన నెహౄ వారసత్వం’ అంతే ఆ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వేళ చేస్తున్న ప్రచార పటాటోపం అంతా ఇంతా కాదు.  
Related image
ఫ్రధాని నరేంద్ర మోడీని ఢీకొనే స్థాయిలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బలం పుంజుకోక పోయినా, ఎందుకో నమోమో మాత్రం రాగా ను కాంగ్రెస్‌ ని చూసి భయపడు తున్నారా? అంటే కొంత నిజమే ననిపిస్తోంది. రాజీవ్‌ గాంధీపై ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఆగ్రహం తెప్పించేశాయి. 'మనమధ్యన లేని రాజీవ్‌గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా.? ఇది నీతిమాలిన చర్య. రాజీవ్‌ గాంధీ దేశానికి ఎంతో మేలు చేశారు. మీరు ఏం చేశారు.?' అంటూ నరేంద్ర మోడీపై చంద్రబాబు విరుచుకు పడిపోయారు. 
Image result for nehru dynasty underniath gandhi's label
'చనిపోయిన వారి గురించి అవాకులు చెవాకులు పేలడం హేయం' అంటూ బాబు శ్రీచంద్ర నీతులు చెప్పటం మొదలెట్టారు. ఒకే! మంచిదే! మరణించిన వారిలోని మహత్మ్యం గుఱించి మాట్లాడుకోవాలి గాని - చెడు మాట్లాడ రాదు!”  ఇది ఒక నీతి. నాయకులెవరినా ప్రజలకు మార్గదర్శకులు కావాలి” ఒక సూక్తి ముక్తావళి వల్లించే వారు, కనీసం దాన్ని పాటించి చెపితే కొంత అర్ధం పరమార్ధం ఉంటుంది. 
Image result for nehru dynasty underniath gandhi's label
దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి విషయంలో ఇదే చంద్రబాబు ఈ నియమం పాటిస్తున్నారా?  కాదు లేదు గదా!  ఇప్పటికీ, చంద్రబాబు – మరణించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి మీద విమర్శలు చేయడంతోనే రాజకీయంగా తన కీర్తి పెరుగుతుందని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కొన్ని వందల, వేలసార్లు వైఎస్‌ రాజశేఖరరెడ్డి  'నామజపం’ చేస్తూనే వున్నారు కదా!  చంద్రబాబు!  మీరు మాత్రం మరణించిన వ్యక్తుల మీద వివాదాస్పద వ్యాఖ్య లు చేయవచ్చు – కాని నరేంద్ర మోడీ మాత్రం రాజీవ్ గాంధి మీద అలా చేయకూడదనటం న్యాయం కాదు సుమా!  అంటూ వేలెత్తి చూపుతున్నారు మీకు తెలియనిదేముంది 

Image result for nehru dynasty underniath gandhi's label

శ్రీచంద్ర నీతులు ఇతరులకు చెప్పేటందుకే తప్ప, తను ఆచరించుటకు కాదన్న మాట! ఆయనగారికి ప్రత్యేక నీతిశాస్త్రం అదే శ్రీచంద్ర నీతి- సూక్తి ముక్తావళి ఉంద నేది జనాభిప్రాయం.  స్వయానా  "లా మేకర్" అయిన ఆయన రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికల కోడ్ ను త్రొసిరాజని దేశ ఎన్నికల యంత్రాంగం పైనే దాడి చేయటం తగునా!  అనేది విఙ్జుల అభిప్రాయం  

Image result for nehru dynasty underniath gandhi's label

"రాజ్యాంగం నిర్దేశించిన మూడు వ్యవస్థలలో ఏ వ్యవస్థ పనితీరు లోనైనా లోపాలుంటే దాన్ని పట్టుకొని వీధిన పడకుండా చూడటానికే నియమితమైంది "న్యాయవ్యవస్థ" అది "ఆర్బిట్రేట్" చేస్తుంది లేదా శాసనవ్యవస్థకు పాత శాసనంలో మార్పును నిర్దేశించటం లేదా తగిన నూతన శాసనం చేయమని సలహాగాని సూచనగాని ఇస్తుంది"  


ఇతర వ్యవస్థలు పనిచేయక పోతే వాటిని శాసించే అధికారం "శాసనకర్త" కు కూడా లేదన్న విషయం తెలియదా?  ఒక వ్యవస్థ పని తీరులో లోపాలుంటే ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టవచ్చు. అంతేకాని వ్యవస్థల్లోని విధి నిర్వాహకులపై బెదిరింపులతో దాడి చేయకూడదు.  ప్రజాబలమున్న నాయకులకు జనబలం ఉంటుంది అందులో అనుమానం లేదు. జనబలంతో రాజ్యాంగ నిర్దేశిత వ్యవస్థల్లోని వ్యక్తులను బెదిరించటం దాడిచెయ్యటం నీతి న్యాయం మాలిన నిరంకుశత్వం లేదా ఒక్క మాటలో చెప్పాలంటే "అరాచకం" గా చెప్పొచ్చు. 


ఒక శాసనకర్త గా మీ పరిది మీరు దాటకుండా ఉండటమే మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. జనముంది ధనముంది కులముంది ధైర్యముంది అని కొండచిలువలా ప్రదర్శనచేస్తే, ప్రజలు చలిచీమలు అవుతారంటున్నారు విశ్లేషకులు. దైహిక బలంతో తాత్కాలిక విజయం సిద్ధించినా మీపై ప్రజలకు కలిగేది "ఏహ్య భావన" మాత్రమే.  
Image result for chandrababu EC & CS
సమీప గతంలో బీజేపీతో అంట కాగిన సమయంలో,  కాంగ్రెస్‌ పార్టీ పై శత్రుత్వం ఉన్నప్పుడూ - ఇదే బాబు, కాంగ్రెస్‌ ని అత్యంత దుర్మార్గంగా విమర్శించిన విషయాలు జనాలకు గుర్తున్నాయి. నాడు ఇదే చద్రుడు - ఇందిర,  రాజీవ్‌, రాహుల్‌ ఇలా ప్రతి ఒక్కరిని విమర్శించిన చరిత్ర ఉంది.  మొన్న జరిగి పలితాలు రావలసిన తాజా ఎన్నికల్లో ఓటమి భయం చంద్రబాబు తో తప్పులు చేయిస్తుంది. తానేం చేస్తున్నారో? తానే మాట్లాడుతున్నారో?  అర్థం కాని మానసిక పరిస్థితుల్లో అంటే కంఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారిప్పుడు అని పలువురు కోడై కూస్తున్నారు.
Image result for dwivedi vs chandrababu
ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే, ఎన్నికల్లో ఫలితాలు తేడా కొడితే, ఆ తర్వాత వ్యవహార శైలి ఇంకెంతలా పతనమౌతుందో నని పిస్తుంది.  కనీసం ప్రతిపక్షంలో ఉండే మీవల్ల - మీ చరిత్ర చూపుతూ — మీలాగే అధికార పక్షం ప్రజలకు వామహస్తం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం మీ మౌనం మాత్రమే ప్రజలకు భవిష్యత్ నిస్తుంది. లేకపోతే ప్రతిపక్షంలో కూడా మీరు ప్రజలకు న్యాయం చేయలేరు.  

మరింత సమాచారం తెలుసుకోండి: