గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  డ్రైవర్ల నిర్లక్ష్యం..మద్యం సేవించి వాహనాలు నడపడం..అతి వేగం ఈ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు రోడ్డు భద్ర పై ఎన్నో కార్యక్రమాలు..అవైర్ నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు.  రోడ్డు భద్రతపై ఎన్నో వినూత్న కార్యక్రమాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ చేపట్టే పోలీసులే ఇప్పుడు ఓ చిన్నార ప్రాణం తీశారు. 

వివరాల్లోకి వెళితే..కాగా, యాదగిరిగుట్ట పాత నర్సింహస్వామి ఆలయం వద్ద రెండు రోజుల క్రితం ప్రణతిని పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. దైవ దర్శనం అనంతరం దేవాలయం పరిసరాల్లో ప్రణతి, ఆమె తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ చిన్నారి ప్రణతి(3) మృతి చెందింది. ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: