ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఉధ్రిక్తతలలో జరిగి ముగిశాక - అధికార తెలుగు దేశం పార్టి మరియు ప్రతిపక్ష వైఎసార్ కాంగ్రెస్ పార్టీలు రెండు వాటికవే అధికారంలోకి వస్తామని అలవమాలిన ధీమా ప్రదర్శిస్తున్నాయి. 175 సీట్లు ఉన్న ఏపీ అసెంబ్లీలో అధికారంలోకి రావాలంటే మేజిక్ ఫిగర్ 88. ప్రస్తుతం రెండు పార్టీలూ వేటికవే 100 కు పైగా స్థానాలు గెలుస్తామని చెబుతున్నాయి. లోలోపల మాత్రం 60-70 స్థానాలకు మించి రాకపోతే ఏంటి పరిస్థితి అన్న అంశంపై చర్చిస్తున్నాయి. కాని ఇరువురికీ అంత రంగంలో మాత్రం ఆధిఖ్యత రాకపోతే ఎలా? పరిస్థితి ఎలా ఉండబోతోంది? అన్న అంశంపై తెగ బాధ పడుతున్నాయి.

Image result for buying MLAs in AP

ఏం చేసైనా ఎలా చేసైనా సరే, అధికారంలోకి రావాలి అనుకుంటూ, ఆపరేషన్ ఆకర్ష్‌ కు తెరతీసినట్లు రెండు పార్టీలూ ఒకరి శాసనసభ్యులను మరొకరు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ, కొందరు సీనియర్లతో ఈ రాజకీయ తంత్రాంగం మంత్రాంగం నడిపిస్తున్నాయని తెలిసింది.

Image result for buying MLAs in AP

ఇప్పటికి అధికారంలో ఉన్న టీడీపీ, తన ఐదేళ్ల పాలనా కాలంలో మనస్పూర్తిగా చేసిన పనేదైనా ఉందంటే వారసుడికి మంత్రి పదవి యివ్వటం 23 మంది విపక్ష  ఎమ్మెల్యే లను నయాన్నో భయాన్నో ఏరవేసో కొనేసో ఇతర ప్రలోభాలకు గురిచేసో ఆకర్షించుకుంది. అలా చట్టవిరుద్ధంగా ధర్మ న్యాయ చట్టాలకు అతీతంగా పార్టీ పిరాయించిన శాసనసభ్యులపై అనర్హత వేటు వెయ్యాలని ప్రతిపక్ష వైసీపీ పోరాడినా దున్నపోతుమీద వానకురిసిన విధంగా చలనం కాని ఫలితం కాని లేక పోయింది.

 Image result for buying MLAs in AP

మే 23న ఫలితాలు వచ్చాక, అధికారాన్ని చేపట్టేందుకు సరిపడా స్థానాలు దక్కకపోతే, అప్పటికప్పుడు ఏ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలనైనా బేరంపెట్టో ప్రలోభపెట్టో కొనేందుకు ఎంత డబ్బు కావాలో? ఏ రేటుకి ఎమ్మెల్యేలు దొరుకుతారో? ఆ లెక్కలపై టీడీపీ సమాలోచనలు జరుపుతోందన్న ప్రచారం సాగుతోంది. ఎలాగో చేసి పనిగానిస్తే ఉభయ రాష్ట్రాల్లో శభాపతులనే పీఠంపై కూర్చున్నవాళ్లు ఇప్పటికే ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పారు.

Image result for telugu speakers of ap & Telangana

వైసీపీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు 23 మంది ఎమ్మెల్యేలను చేజార్చుకున్న ఆ పార్టీ ఈసారి తమ ఎమ్మెల్యేలపై నియంత్రణ చేస్తూనే, ప్రత్యర్థి పార్టీల నుంచీ ఎవరెవరు తమ పార్టీలోకి పిరాయిస్తారో దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. అయితే కొంత రాజ్యాంగ సంస్కారాన్ని పాటించాలని అనుకొంటుందట. టీడీపీలాగా పిరాయింపులను  ప్రోత్సహించకుండా, రాజీనామా చేయించి, మళ్లీ ఉప ఎన్నికలు జరిపించి, తమ పార్టీ తరపున పోటీ చేయించి, గెలిపించుకోవాలనే తహతహలో ఉన్నట్లు సమాచారం.

Image result for jagan vijay sai reddy

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో శాసనసభ్యుడి వెల ₹30 కోట్లుట..ఇంత ఎక్కువ వెల పలకటానికి ప్రత్యేక కారణం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కో అభ్యర్థీ దాదాపు ₹.30 కోట్ల దాకా ఖర్చు పెట్టారనీ, ఇప్పుడు ఆ డబ్బును రాబట్టుకోవడానికి కనీసం ఆపరేషన్ ఆకర్ష్ టైంలో డిమాండ్ చేయబోతున్నారని తెలుస్తుంది.

Image result for jagan vijay sai reddy

వెలకు అదనంగా కొందరు ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి అన్నట్లు "కేబినెట్ బెర్తులు" కూడా డిమాండ్ చేస్తున్నారట. అయితే వివిధ పార్టీల ఎమ్మెల్యేలు కూడా, తమకు డిమాండ్ పెరగడంతో, మీ పార్టీలోకి వస్తే డబ్బుతో పాటూ మంత్రి పదవి కూడా ఇస్తారా? అయితే ఓకే అనేవారూ ఉన్నారట. ఇదివరకు టీడీపీ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల లో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది.

Image result for jagan vijay sai reddy

ఏపి ముఖ్యమంత్రి టిడిపి అధినేత ఓటుకు నోటు కేసు ద్వారా మొదలెట్టగా పరువుపోగొట్తుకొని హైదరాబాద్ నుండి పారిపోయి కూడా ఇదే దుష్ట సాంప్రదాయాన్ని ఇరు రాష్ట్రాలకు నేర్పారు కదా! ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ, ఆఫర్ ఇలాగే ఇస్తారా? అని అడుగుతున్నారట ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు. వైసీపీ మాత్రం మంత్రి పదవులపై ఇప్పుడే చెప్పలేమనీ, ఫలితాలు వచ్చిన తర్వాతే ఏ నిర్ణయమైనా ఉంటుందని అసలు విషయాన్ని దాట వేస్తోందని సమాచారం.

Image result for jagan chandrababu

నిజానికి టీడీపీ, వైసీపీలో ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలలో సీనియర్లంతా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఉన్న పదవులు వాళ్లకు ఇవ్వడానికే సరిపోవు. అందువల్ల పిరాయింపుల ద్వారా వచ్చే ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు, వివిధ ప్రభుత్వ రంగసంస్థల పాలక మండళ్ల డైరెక్టర్లు, నామినేటెడ్ పోస్టులవంటి పదవులు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిసింది. మొత్తానికి ఎన్నికల ఫలితాలు రావడానికి మరో 10రోజులు ఉండగానే ఆపరేషన్ ఆకర్ష్ ఉభయపార్టీల్లో స్పీడందుకొందని సమాచారం. ఏవడు అధికారంలోకి వచ్చినా ఈ దుష్టసాంప్రదాయాన్ని విజయవంతంగా నెలకొల్పిన నారా వారికి జాతీయస్థాయిలో ఏదో అవార్డ్ యివ్వవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: