వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రోజాకు తప్పకుండా పదవి వస్తుందని అనుకున్నారు.  కానీ, రోజాను పక్కన పెట్టి మిగతా వాళ్లకు పదవులు కట్టబెట్టారు.  అందరికి సమన్యాయం కోసమే ఇలా చేసినట్టు తెలుస్తోంది.  దీంతో రోజా అసంతృప్తితో ఉన్నది. 


రోజా వంటి నాయకురాలు వైకాపాలో తన వాయిస్ ను వినిపించారు.  అసెంబ్లీలో పోరాటం చేశారు.  సభనుంచి గతంలో సంవత్సరం పాటు సస్పెన్స్ అయ్యారు. అయితే, రోజాకు పదవి రాకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.  


రోజా మంచి లీడర్ అని, మహిళల సమస్యలకు సంబంధించిన ఎన్నో విషయాలపై ఆమె స్పందించారని, అలాంటి రోజాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని విజయశాంతి అన్నారు.  జగన్ సమన్యాయం చేయడం మంచిదే కానీ, రోజా లాంటి మహిళకు పదవి ఇవ్వక పోవడం అన్యాయం అని చెప్పింది.  


జగన్ ఇలా చేయడం సరికాదని, సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తులను కేవలం ప్రచారం కోసమే ఉపయోగించుకుంటే ఎలా అని ప్రశ్నిస్తోంది విజయశాంతి.  విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలంగా మారాయి.  ఆమె ఎందుకు ఆలా చేసిందో అర్ధం గాని విషయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: