ఈనెల 17 వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి.  ఈ సమావేశాల్లో ఎంపీలు, మంత్రుల ప్రమాణస్వీకారం, అనంతరం స్పీకర్ ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడిన తరువాత సభ వాయిదా పడుతుంది.  ఆ తరువాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి.  

బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికశాఖ మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెడతారు.  కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు.  ప్రతి బడ్జెట్ లోను తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి  చూపించడమే పరిపాటిగా మారింది.  ఇప్పుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రానికి చెందిన మహిళ కావడంతో తెలుగు రాష్ట్రాలకు కొంతమేరైనా బడ్జెట్ ను కేటాయిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

రైల్వే, రోడ్డుతో పాటు మౌళిక వసతుల కల్పన కోసం ఈ బడ్జెట్ లో ఎంత కేటాయిస్తారా చూడాలి.  అలాగే కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులను ఈ బడ్జెట్ లో కేటాయిస్తారా లేదా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బాధ్యత తమదే అని కేంద్రం చాలాసార్లు చెప్పింది.  నిధుల విషయంలో మాత్రం వెనకడుగు వేసింది.  

ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లోనైనా ఆ నిధులు కేటాయిస్తారా..? గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులకు కేటాయించే కేంద్రం ఇప్పుడు ఏ రాష్ట్రానికి వరాలు కురిపిస్తోందో చూడాలి. వీటిపై సుంకం పెరుగుతుందో వీటిమీద సుంకం తగ్గించి ఆకట్టుకుంటారో చూడాలి.  గత ఐదేళ్లుగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఉన్నత శ్రేణి వర్గాలకు అనుగుణంగా ఉన్నది.  ఇప్పుడైనా కేంద్రం సామాన్య ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ను ప్రవేశపడితే బాగుంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: