బీజేపీ రధ సారధి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర గృహమంత్రి  అమిత్ షా పేరుతో కొత్తరకం మామిడి పండ్లు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అమిత్‌ షా కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ మాంగో-మాన్ పద్మశ్రీ హజీ కలీముల్లా ఒక ప్రఖ్యాత కొత్త మామిడి వంగడాలను రూపొందించే ప్రొఫెషనల్ మాంగో గ్రోయర్. ఉత్తరప్రదేశ్‌ లోని మలిహబాద్‌కు చెందిన ఈ ‘మ్యాంగో మ్యాన్’ రూపొందించిన సరికొత్త మామిడి పండ్లకు ‘షా’ అని పేరు పెట్టారు. 
New mango variety named after Amit Shah
ఈ సందర్భంగా హజీ కలీముల్లా మాట్లాడుతూ, ‘‘మంచి బరువు, రుచి, రూపం మృదుత్వం  ఉండే ఈ మామిడి పండుకు ‘షా’ అని పేరు పెట్టారు. ఈ సరికొత్త మామిడి వంగడం నుండి పంట రాగానే త్వరలోనే మార్కెట్లో విక్రయిస్తాం. ఈ మామిడి పండు తప్పకుండా ఆయనకు నచ్చుతుంది’’ అని తెలిపారు. అమిత్ షా భారతజాతిలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల మద్య 'సామాజిక అనుబంధం' అనే చక్కని కల నేతతో  'భిన్నత్వంలో ఏకత్వం' సాధించటం తననెంతో ఆనంద పరచిందని అన్నారు. అందుకే ఆ సామాజిక అనుబంధంలోని తీయదాన్ని ప్రతిబింబించే తాను సృష్టించిన కొత్తరకం మామిడి వంగడం మహా వృక్షమై అందించిన మామిడి పండ్లకు "షా మామిడి పండ్లు" అని పేరు పెట్టానని ఎమోషనల్ గా చెప్పారు.    
Image result for haji kalimullah mango man
ఈ పండ్ల రుచి చూసిన ఉద్యోగులు గాని గ్రామీణ పామరుడు గాని పండ్ల బరువు రుచి మృదుత్వం తెలిసిన మధుర మామిడి ఫలాల ప్రియులు ఒకేలా స్పందించారని అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కలిముల్లా విభిన్నరకాల మామిడి వంగడాలను పండిస్తూ గుర్తింపు పొందారు. 2015లో ఒక  అరుదైన మామిడి వంగడానికి (పండు) ఆయన ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టారు. ఆయన తోటలో ఒకే చెట్టుకు 300 రకాల మామిడి పండ్లు కాస్తున్నాయంటే అతను ఎంత క్రియేటివ్‌గా మామిడి వంగడాలను సృష్టిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: