సాధారణంగా మనం కొనే వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తే ఎందుకూ? ఏమిటీ? అనే ప్రశ్నే లేకుండా పరిగెత్తి కొంటాం.  ఇక పండుగ సందర్భాల్లో మార్కెట్లో దొరికే అన్ని వస్తువులపై బంపర్ ఆఫర్లు ప్రకటిస్తే అక్కడికే వెళ్లి ఖరీదు చేస్తాం.  అలాంటిది ఆడవారికి ఇష్టమైన చీరలు అందులోనూ కేవలం రూ.20 కి మాత్రమే అని ప్రకటన రావడమే ఆలస్యం ఉదయం 6 గంటల నుంచి అక్కడ క్యూ కట్టారు..ఆ చీరలు తమకే దక్కాలని పోటీ పడి తోపులాటలో గాయాల పాలయ్యారు. 

ఇంతకీ ఈ బంపర్ ఆఫర్ ఎక్కడా..రూ. 20 కే చీర ఏంటీ అనుకుంటున్నారా?  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో ఓ బట్టల దుకాణం యజమాని మహిళలకు బంపర్ ఆఫరిచ్చాడు. దీంతో షాపు తీయడానికి ముందే వందలాది మంది  మహిళలు ఆ దుకాణం ముందు క్యూ కట్టారు.  పెద్దపల్లిలో ఓ బట్టల దుకాణం యజమాని కేవలం రూ.20 కే చీర అనడంతో గురువారం నాడు దుకాణం తెరవడానికి ముందే వందలాది మహిళలు  బట్టల షాపు ముందు క్యూ కట్టారు. 

ఇక ఆ షాపు ఎప్పుడు తెరుస్తారా మంచి మంచి చీరలు దక్కించుకుందామా అని మహిళలు ఆశతో ఉన్నారు..ఒక దశలో ఆ షాపు తెరవడానికే ఇబ్బంది అయ్యే పరిస్థితి నెలకొంది. ఎలాగో అలా షాపు తలుపులు తెరిచిన తర్వాత దుకాణంలోకి వెళ్లేందుకు మహిళలు పోటీపడ్డారు.  దీంతో తోపులాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు మహిళలకు స్వల్పంగా గాయపడ్డారు. అంతే మరి మహిళలకు ఇష్టమైన చీరలూ..అందునా అంత తక్కువ ధర ఎవరు మాత్రం వదులుకుంటారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: