గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు.  పసి పాప అని కూడా చూడకుండా అత్యాచారం చేసి హత్యలు చేస్తున్నారు.  ఇలాంటి వారిని ఎన్ కౌంటర్ చేయాలని ప్రజా ఉద్యమాలు ఎన్ని వచ్చిన ప్రభుత్వాలు మాత్రం నిర్భయ చట్టం అంటూ కొంత కాలం పాటు జైళ్లలో ఉంచడం మాత్రమే చేస్తున్నారు.

ఇటీవల తొమ్మిది నెలల పసిపాపపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే అనంతలో మూడేళ్ల చిన్నారిపై 40 సంవత్సరాల కీచకుడు అత్యాచారం చేసిన ఘటన కలకం రేపుతుంది.   ఆ చిన్నారి ఆపస్మారక స్థితిలో ఉండగా తల్లిదండ్రులు చూసి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.. ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారికి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.

నింధితుడిపై ఫోక్సో చట్టం నమోదు చేశారు పోలీసులు.  గత కొంత కాలంగా ఇలాంటి అత్యాచారాలు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న పోలీసులు ఎందుకు అంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మహిళలు, సామాజిక కార్యకర్తలు, బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: