కేంద్ర బడ్జెట్‌పై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పెదవి విరిచారు.బడ్జెట్‌ పూర్తి నిరాశాజనకంగా ఉందన్నారు.ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు.

 

ఈ రెండు పథకాలకూ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని గతంలో నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందనీ, అయితే కేంద్రం 24 రూపాయలు కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో కనీసం ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రం విస్మరించిందని కేటీఆర్‌ ట్విట్టర్‌లో ప్రస్తావించారు.

 

ఐదేళ్లు పూర్తయినా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఒక మహిళ దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వకారణమని మాజీ ఎంపీ కవిత అన్నారు. పలు పథకాలపై కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రశంసలు వచ్చాయని గుర్తు చేశారు.

 

ఈ మేరకు కవిత ట్విటర్‌లో స్పందించారు. కేంద్రం నుంచి ప్రశంసలు వస్తున్నాయని కానీ, నిధులు మాత్రం రావడం లేదని ట్విటర్‌లో పోస్టు చేశారు. రాష్ట్రానికి రావాల్సినవి కూడా దక్కకపోవడం బాధాకరమన్నారు. ఏదేమైనా మొత్తం కధకి సూత్రధారి అండ్ పాత్రధారి మోడీ అని మనకు సుస్పష్టం అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: