టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం అబద్దాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని వైసీపీ మండిపడింది. 2014 ఎన్నికల ముందు టీడీపీ మేనిఫెస్టోలో రైతులకు పావలావడ్డీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారని..కాని ఐదు శాతం కూడా అమలు చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌ విమర్శించారు.


2019లో టీడీపీ మేనిఫెస్టోలో పూర్తిగా రుణమాఫీ చేశామని అసత్యాలు చెప్పారని వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 600 కోట్లు మాత్రమే మాఫీ చేశారని..అది రైతులను మోసం చేసినట్లు కాదా అని అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ప్రశ్నించారు. అవాస్తవాలతో టీడీపీ ప్రజలను పక్కదారి పట్టిస్తుందన్నారు.


గత టీడీపీ ప్రభుత్వం రైతులు, మహిళలను మోసం చేసిందన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడేటప్పుడు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలంతా అడ్డు చెప్పకుండా విన్నారని.. అనంతరం సభ నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతుంటే ప్రతిపక్షం సభ్యులు పెద్ద ఎత్తున గొంతు విప్పి అడ్డు తగలడం చాలా దారుణమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: