నేడు దేశ వ్యాప్తంగా గరవర్నల నియామకం చక చకా సాగిపోయింది.  రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించారు. ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వ భూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఏపీ గవర్నర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.


 గతంలో జనసంఘ్, జనతాపార్టీల్లో బిశ్వ భూషణ్ హరిచందన్ పని చేశారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1988లో జనతా పార్టీ లో చేరిన ఆయన 1996లో తిరిగి బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే చత్తీస్ ఘడ్ గవర్నర్ గా బీజేపీ సీనియర్ మహిళా నేత అనసూయ ఊకిని నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.


అనసూయ ఊకీ ప్రస్తుతం నేషనల్ ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ బీజేపీలో కీలక నేతగా అనసూయ ఊకీ వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: