ఉమ్మడి అంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా లక్ష్యంగా పోరాటం చేస్తూనే ఉంది. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి గెలిచిన తరువాత 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేకహోదా ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదని చెప్పి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది. ప్రస్తుతం బీజేపీ నాయకుల మాటలు వింటూ ఉంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావటం అంత సులభమైన విషయం కాదని అర్థమవుతుంది. 
 
బీజేపీ పార్టీకి చెందిన మహిళా నేత పురంధేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ నిధులు కేంద్రం ఇవ్వడానికి సిధ్ధంగా ఉందని ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబులాగా హోదాపై వివాదం చేయొద్దని పురంధేశ్వరి జగన్ కు సూచించారు. జగన్మోహన్ రెడ్డిగారు హోదా కోసం ఎంత పోరాడినా ఫలితం ఉండదనే విధంగా పురంధేశ్వరి వ్యాఖ్యలు చేసారు. 
 
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమలు చేస్తున్న పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని పురంధేశ్వరి అన్నారు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డిగారు 15 వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడటం కోసం ప్రత్యేక హోదా ఇవ్వబోతుందనే వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో బీజేపీకే చెందిన పురంధేశ్వరి ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పటంతో ప్రత్యేక హోదా రావటం అంత తేలిక కాదని తెలుస్తుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: