ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబును రాజకీయంలో చాణక్యుడితో పోలుస్తారు.. కానీ ఆయన పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నట్టు అనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం చంద్రబాబు అండ్ కో వ్యవహరించిన తీరు చూస్తే ఈ మాట ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45ఏళ్లకే ఫించన్ ఇస్తానని జగన్ ఎన్నికల సభల్లో చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారన్న అంశంపై మంగళవారం ప్రతిపక్షం అసెంబ్లీని అట్టుడికించింది. ఇందుకు సాక్ష్యంగా ఓ పేపర్ క్లిప్పింగ్ చూపించారు. అసెంబ్లీలో వీడియో ప్రదర్శిస్తామని కూడా టీడీపీ చెప్పుకొచ్చింది.


అయితే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45ఏళ్లకే ఫించన్ ఇస్తానని జగన్ చెప్పిన మాట వాస్తవమే..కానీ అది ఎప్పుడు.. 2017లో ఆ తర్వాత స్టాండ్ మార్చుకున్నారు. ఆ విషయాన్ని జనంలో బహిరంగంగానే ప్రకటించారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్ ను కూడా అసెంబ్లీలో ప్రదర్శించారు.


విషయం ఇంత క్లారిటీగా ఉంటే.. జగన్ మాట తప్పినట్టుగా టీడీపీ జోరుగా ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. మళ్లీ పాత పాటే పాడారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జగన్ మాట్లాడిన పాత వీడియో ప్రదర్శించారు.


45ఏళ్లకే ఫించన్ అని చెప్పుకుంటూ జగన్ రాష్ట్రమంతా తిరిగారని.. మాట తప్పం మడం తిప్పమని పదే పదే ఇదే విషయం చెప్పి ఓట్లు వేయించుకున్నారని చంద్రబాబు విమర్శించారు. ఈ రోజు అదే విషయం మా వాళ్ళు అడిగితే సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ రోజు మాట తప్పి 5ఏళ్లకు 75వేలు జగన్ ఇస్తామంటున్నారని మండిపడుతున్నారు. అంటే బాబు ఇక మారడన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: