ఆమె.. తమిళనాడులో అమ్మ జయలలిత వారసురాలు.. పోలికలోనూ అచ్చు ఆమెలాగానే ఉంటుంది.. అదే లావు.. అదే లావణ్యం.. జయలలిత వారసురాలిగా తమిళనాడులో చక్రం తిప్పాలనుకుంది. అందుకే ఓ పార్టీ పెట్టింది.. కానీ రెండేళ్లు తిరగకుండానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసింది.


తన నిర్ణయానికి కారణంబూతులే అంటూ వివరణ కూడా ఇచ్చింది. రాజకీయాల్లో కొనసాగుతున్న మహిళలపై బూతుల దాడిని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. పార్టీ మూసివేత ప్రకటన తర్వాత ఆమె ఓ టీవీ ఛానళ్లో మాట్లాడారు.. ఆమె ఏమన్నారంటే..


‘నాకు రాజకీయాల్లో అనుభవం లేదు. నాకు మార్గదర్శకం చేసేందుకు సరైన వ్యక్తులు లేరు. నేను మోసపోయాను. సోషల్ మీడియాలో తనపై బూతు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి పరిణామం నేను ఊహించలేదు. మహిళలు రాజకీయాల్లో కొనసాగాలంటే సోషల్ మీడియాలో బూతు కామెంట్లు పోస్ట్‌ చేయడం ఆపాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రూపా.


జయలలిత మరణం తరువాత ఆమె వారసురాలిగా వెలుగులోకి వచ్చారు దీప. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలైన దీప.. జయ మరణం తర్వాత 2017 ఫిబ్రవరి 24న ‘ఎంజీఆర్‌ అమ్మా దీపా పేరవై’ పార్టీ పెట్టారు. కానీ ఆమె ఆ పార్టీని విజయవంతంగా నడపలేకపోయారు. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గాజల మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో నాయక శూన్యత ఉన్నా.. దాన్ని ఆమె భర్తీ చేయలేకపోయారు. రాజకీయంగా విజయవంతం కాలేక.. రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు దీప తన ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటన చేశారు.


తన పార్టీని జులై 30, 2019న అన్నాడీఎంకేలో విలీనం చేశానని, ఇకపై రాజకీయ విషయాలపై చర్చించేందుకు తన వద్దకు ఎవరూ రావద్దంటూ ఆ ప్రకటనలో వెల్లడించారు. అమ్మ నిజమైన రక్త వారసురాలిని నేనేనంటూ ఆమె అన్న కుమార్తె దీప రాజకీయాల్లో ప్రవేశించినా.. జయలలితలో ఉన్న ధైర్యం, తెగువ ఆమెలో కనిపించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: