టిక్ టాక్ టాక్ టాక్ ఎక్కడ చూసినా ఇప్పుడు టిక్ టాక్ మానియానే కనిపిస్తుంది. సాంగ్స్, డైలాగ్స్, కొన్ని సొంత ప్రయోగాలు ఇలా అన్ని రకాలుగా ఫీట్స్ చేస్తూ ప్రజల మెప్పు పొందాలని తెగ తాపత్ర పడుతున్నారు ఔత్సాహికులు.  ఈ టిక్ టాక్ మహమ్మారి చిన్న వయసు నుంచి ముదుసలి వారి వరకు ఎవ్వరినీ వదలడం లేదు.  అయితే టిక్ టాక్ ఫన్నీగా ఉంటే ఓకే..కానీ కొంత మంది ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు.  ఇటీవల కాలంలో టిక్ టాక్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకులు కథనాలు సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ ఎవ్వరిలోనూ మార్పురావడం లేదు. 

ఇక టిక్ టాక్ దరిద్రం ఎలా సాగుతుందంటే..ప్రభుత్వ,  ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా కొనసాగుతుంది.  ఆ మద్య ఖమ్మం కార్పోరేషన్ లో ప్రజలు ఎంత రద్దీగా ఉంటారో తెలిసిందే. అలాంటి ఆఫీస్ లో కొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తాపీగా టిక్ టాక్ చేస్తూ ప్రజలను పట్టించుకోకుండా ఉండటం..అవి కాస్త వైరల్ కావడంతో కమీషనర్ సీరియస్ అయి ఉద్యోగాలు తొలగించారు.  గుజరాత్ లో ఓ మహిళా కానిస్టేబుల్ డ్రెస్ లేకుండా లాకప్ ముందు టిక్ టాక్ చేయడంతో ఉద్యోగం పోగొట్టుకుంది. విచిత్రం ఏంటంటే ఆమెను తొలగించిన డీఎస్పీ కూడా టిక్ టాక్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యింది. 


ఇక ఆసుపత్రుల్లో ఉన్న ఉద్యోగులు సైతం టిక్ టాక్ చేయడం..ఇలా ఎక్కడ పడితే అక్కడ టిక్ టాక్ మానియాతో జనాలు ఊగిపోతున్నారు. ఇదిలా ఉంటే..పోలీస్ శాఖలో టిక్‌టాక్‌ వివాదంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. డ్యూటీలో ఉండి టిక్‌టాక్‌లు చేయడం సరికాదని పోలీసు సిబ్బందిని డీజీపీ హెచ్చరించారు. ఇటీవల కొందరు మహిళా పోలీసులు డ్యూటీ టైమ్‌లో టిక్‌టాక్ చేశారు.


ఆ వీడియోలు కాస్తా వైరల్ అవడంతో ఉన్నతాధికారులు వారి తీరుపై ఆగ్రహించారు. ఇదే అంశంపై నేడు స్పందించిన డీజీపీ.. ఖాళీ సమయంలో సరదాకు టిక్‌టాక్‌లు చేసినట్లు తెలిసిందన్నారు. టిక్‌టాక్ చేసిన మహిళా సిబ్బందిపై విశాఖ సీపీ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈసారి ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: