ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ అమలు చేయ సంకల్పించిన నవరత్నాలకు సహయం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కి సిఎ జగన్ సమర్పించిన వినతి పత్రంలోని ముఖ్యాంశాలు ఇవి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి నవరత్నాల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టాం. కౌలు రైతులకోసం, ఉపాథికల్పన కోసం, సమాజంలో అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికోసం ఇటీవల అసెంబ్లీలో కీలక చట్టాలను తీసుకు వచ్చాం.
రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయాం. 2014–15లో రూ.97వేల కోట్లు ఉన్న అప్పులు, 2018–19కు 2.58 లక్షల కోట్లకు చేరాయి. ఈ నేథ్యంలో రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలి. వెనుకబడ్డ జిల్లాల కోసం ఈ ఆరేళ్లలో రూ.2100 కోట్లు రావాల్సి ఉండగా, రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారు. కేబీకే ప్యాకేజీ తరహాలో కేంద్రం నుంచి గ్రాంట్లు ఇవ్వాలని కోరుతున్నా.



• పోలవరం ఎడమ కాల్వద్వారా ఉత్తరాంధ్రలో చెరువులను నింపే కార్యక్రమానికి తగిన సహాయం చేయండి.
• ప్రతి ఇంటికీ కుళాయిద్వారా రక్షిత మంచినీరు ఇవ్వడానికి వాటర్ గ్రిడ్ను తీసుకొస్తున్నాం.
• 60 రిజర్వాయర్లలో నీటిని వినియోగించుకుని వాటర్ గ్రిడ్ కింద రక్షిత నీటిని ఇస్తాం:
• దీనికోసం రూ.60వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా, కేంద్రం నుంచి తగిన రీతిలో సహాయం అందించండి:
• గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ద్వారా కరువును పారదోలడానికి ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాం, దీనికి కేంద్రం నుంచి సహాయాన్ని అర్థిస్తున్నాం.
• సెక్ డేటాలో లోపాల వల్ల లబ్ధిదారులందరికీ కేంద్ర గృహనిర్మాణం పథకం అందడంలేదు.
• ఈ డేటాను సరిచేసి అర్హులైన వారందరినీ లబ్ధిదారులుగా ఎంపిక చేయాలి.
• కేంద్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి.
• రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక రంగానికి ప్రత్యేక హోదా అత్యంత అవసరం.
పారిశ్రామిక రాయితీలు కల్పించండి. పదేళ్లపాటు జీఎస్టీ మినహాయింపులు, పదేళ్లపాటు ఆదాయపుపన్ను మినహాయింపులు సహా ఇతరత్రా రాయితీలు ఇవ్వండి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితులు దృష్యా›్ట ఈ రాయితీలు పారిశ్రామికాభివృద్ధికి అవసరం ఉందన్నారు. అంతేకాకుండా రెవిన్యూ లోటు కింద ఇంకా 18,969 కోట్లు భర్తీచేయాల్సి ఉంది.
• పోలవరం ప్రాజెక్టును జాతీయ హోదా ప్రాజెక్టుగా ప్రకటించకముందే రూ.5,103 కోట్లు ఖర్చుచేశారు. ఈ డబ్బును ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాక ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.16వేల కోట్లు భూసేకరణ, పునరావాసం కూడా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాం.
• కడప స్టీల్ ప్లాంటుకోసం సరైన స్థలాన్ని ఎంపిక చేశాం, రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్ధికోసం ఈ ప్లాంట్ నిర్మాణంకోసం కేంద్రం ముందుకు రావాలని కోరుతున్నాం.
• విభజన చట్టం ప్రకారం దుగ్గరాజపట్నం పోర్టును నిర్మించి ఇవ్వాలి. కాని అక్కడ పోర్టు నిర్మాణంపై నీతిఆయోగ్ చెప్పిన అభ్యంతరం నేపథ్యంలో రామాయపట్నంలో పోర్టును నిర్మించి  ఇవ్వాలని కోరుతున్నాను.
• రాజధానికోసం రూ.2500 కోట్లను కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకూ రూ.1500  కోట్లు మాత్రమే ఇచ్చారు.
• రాజధాని ప్రాంతంలో అవకతవకలు, అక్రమాల ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, అది పూర్తయ్యాక రాజధాని కోసం కావాల్సినవి కోరుతాం, శాస్త్రీయ దృక్పథంతో ప్రతిపాదనలు అందిస్తాం.
• నవరత్నాలు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధామ్యాలు.
• ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పథకాలు రూపొందించాం.
• నవరత్నాలకు తగిన రీతిలో సహాయం చేయండి.
• పెట్టుబడి సహాయం కింద ప్రతి రైతుకుంబానికి ఏడాదికి రూ.12,500 ఇస్తాం
• దాదాపు 80శాతం మేర పెట్టుబడి 80శాతం పంటలకు అందినట్టే.
• 1.25 ఎకరాల్లోపు రైతులు యాభైశాతం ఉంటే, 2.5 ఎకరాల్లోపు రైతులు 70శాతం మంది ఉన్నారు. వీరందరికీ భారీగా మేలు చేకూరుతుంది:
• అంతేకాక 16 లక్షల మంది కౌలు రైతులకూ ఈపథకాన్ని వర్తింపచేస్తున్నాం
• కేంద్రం తగిన సహాయం చేయాలని కోరుతున్నాం.
• అంతేకాక ధరల స్థిరీకరణకు రూ.3 వేలకోట్లు, ప్రకృతి వైపరీత్యాల నిధి కింద రూ.2 వేల కోట్లు కేటాయించాం
• మరెన్నో పథకాలు వారికోసం తీసుకొచ్చాం... కేంద్రంకూడా అండగా ఉండాలని కోరుతున్నాం.
• సంపూర్ణ అక్షరాస్యత కోసం, పిల్లలందర్నీ బడికి పంపడంకోసం అమ్మఒడి అనే విశిష్ట కార్యక్రమం చేపట్టాం:
• పిల్లలను బడికి పంపే ప్రతి నిరుపేద తల్లికీ ఏడాదికి రూ.15వేలు ఇస్తాం.
• వచ్చే జనవరి 26 నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం.
• కేంద్రకూడా తన పథకాలద్వారా దీనికి సహాయం చేయాలని కోరుతున్నాం.
• 40వేల స్కూళ్లో మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించేభారీ కార్యక్రమాన్ని చేపట్టాం.
• తాగునీరు, టాయిలెట్లు, ఫర్నిచర్, బ్లాక్బోర్డ్స్, ఫ్యాన్లు, కాంపౌండ్వాల్స్, పెయింట్ అండ్ ఫినిషింగ్ పనులన్నీ ప్రాధాన్యతా క్రమంలో చేపడతాం.
• టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతినెలా ప్రతి స్కూలుమీ రూ.5వేలు ఖర్చుపెడతాం. కేంద్రం కూడా సహాయం చేయాలని  కోరుతున్నాం.దేశంలో గ్రాస్ ఎన్రోల్ మెంట్, బ్రిక్స్ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. భారత్లో 25శాతం ఉంటే, రష్యాల 81 శాతం, బ్రెజిల్లో 50, చైనాలో 48శాతం ఉంది. దీన్ని పెంచడానికి పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్మెంట్ను అమలు చేస్తాం.



• ప్రతి పేద విద్యార్థికీ ఏటా రూ.20వేలు బోర్డింగు, హాస్టల్  ఖర్చుల కింద ఇస్తాం. దీనికి తగిన సహాయం చేయమని జగన్మోహన్ రెడ్డి కోరారు.
• రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతిఒక్కరికీ కూడా వైద్యం ఖర్చు వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తాం. దీనికి ఎలాంటి పరిమితీ లేదు. వైద్యంచేయించుకోలేక తల్లడిల్లుతున్న పేదలు, మధ్యతరగతి ప్రజలను ఆ పథకం కింద ఆదుకుంటాం. బిక్స్ దేశాల్లో వైద్యంకోసం ప్రజలు తమ సొంత జేబులోనుంచి పెడుతున్న ఖర్చు 40శాతం అయితే.. మన దేశంలో  65శాతం ఉంది. దీనివల్ల పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు మరింత కష్టాలు పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో  ఆరోగ్యశ్రీని కేంద్రం ఒకపైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలి, ఇక్కడ మొదలయ్యే ప్రయాణం యూనివర్సెల్ వర్శెల్ హెల్త్కేర్ దిశగా సాగాలి.


• వచ్చే ఉగాది నాటికి 25లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వబోతున్నాం. ఈపథకానికీ కేంద్రం సహాయం చేయాలని కోరుతున్నాం.
• డ్వాక్రా సంఘాల అప్పులు గడచిన నాలుగేళ్లలో రూ.14వేల నుంచి రూ.28వేల కోట్లకు చేరాయి.
• వడ్డీ బరువు మోయలేక, రుణాలు చెల్లించలేక అక్కచెల్లెమ్మలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
• వైయస్సార్ ఆసరా కింద నాలుగు ఇన్స్టాల్మెంట్లలో వారి చేతికే ఈ డబ్బు ఇస్తాం. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం.
• దాదాపు 89 లక్షల మంది రుణ విముక్తులవుతారు. అంతేకాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 45ఏళ్లు దాటిన మహిళలకు వైయస్సార్ చేయూత కింద నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.19వేలు ఆర్థిక సహాయం చేస్తాం. తగు రీతిలో కేంద్రం ఆదుకోవాలని కోరుతూ  సీఎం వైఎస్ జగన్ తన వినతిలో వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: