“ప్రేమ ఎప్పుడు, ఎందుకు పుడుతుందో చెప్పలేం’ ’ఒకరు నచ్చలేదని చెప్పడానికి వెయ్యి కారణాలు చెప్పొచ్చు.. నచ్చారు అని చెప్పడానికి కారణాలు చెప్పలేం” ఇవి తెలుగు ప్రేమ సినిమాల్లోని డైలాగులు. అచ్చంగా దీన్నేఫాలో అయ్యారు.. ఓ లేడీ కానిస్టేబుల్, ఓ రౌడీ. ఓ హత్యకేసులో కోర్టుకు హాజరైన రౌడీషీటర్, విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ మధ్య ప్రేమ చిగురించి పెళ్లి కూడా జరిగింది.


 

2014 మే 8న గ్రేటర్ నొయిడాలో రాహుల్ ధాస్రావా అనే రౌడీ.. వ్యాపారి మన్మోహన్ గోయల్ హత్య కేసులో అరెస్టయ్యాడు. కేసుల నిమిత్తం సూరజ్ పూర్ కోర్టుకు వస్తున్న క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ పాయల్ తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. జైలు నుంచి రాహుల్ బయటకు రాగానే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిపై అభ్యంతరాలు వస్తాయని భావించిన ఈ జంట ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు. పెళ్లి తర్వాత రాహుల్ బయట కనిపించలేదు. పాయల్ మాత్రమే డ్యూటీ నిమిత్తం బయటకు వస్తూండేది. పెళ్లినాటికి గౌతమబుద్ద పీఎస్ లో పనిచేస్తున్న పాయల్ పెళ్లి గురించి ఎవరికీ తెలీలేదు. విషయం బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇది నిజమని రుజువైతే ఆమెపై చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ రణ్ విజయ్ సింగ్ అంటున్నారు.


 

ఆటో డ్రైవర్ గా పనిచేసే రాహుల్ డబ్బు, హోదా కోసం 2008లో అనిల్ డుజానా గ్యాంగ్ లో చేరాడు. గోయల్ హత్యతో రాహుల్ కూడా గ్యాంగ్ స్టర్ గా మారిపోయాడు. 2016మే లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన తల్లికి ఓటు వేయకపోతే చంపేస్తానని బెదిరించడంతో పోలీసుల దృష్టిలో పడ్డాడు. ఈ ఏడాది మార్చిలో మాబుపురా ప్రాంతంలో జరిగిన ఎదురుదాడుల్లో రాహుల్ గాయపడ్డాడు. మొత్తానికి ప్రేమకు పరిమితులు లేవని నిరూపించారు వీరిద్దరూ.

 


మరింత సమాచారం తెలుసుకోండి: