ఇండియా పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు రోజు రోజు తగ్గిపోయితున్నాయి.  జమ్మూ కాశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దు తరువాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.  రెండు దేశాల మధ్య యుద్దవాతావరణం తలపిస్తోంది.  అంతర్జాతీయంగా ఇండియాపై ఫిర్యాదులు చేసేందుకు పాక్ రెడీ అవుతున్నది.  ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ విషయాన్ని చర్చకు పెట్టబోతున్నది.  అయితే, సమితి దీన్ని సీరియస్ గా తీసుకోలేదు.  అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ లు ఇండియాకు అనుకూలంగా ఉన్నాయి.  చైనా మినహా అన్ని ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి.  


ఇదిలా ఉంటె, కాశ్మీర్ ఇష్యూపై ఇండియా అంతర్గత వ్యవహారం కాబట్టి పాకిస్తాన్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదని అంటోంది ఇండియా.  ఈ రెండు దేశాల మధ్య రగడ రాజకీయాల నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు పాకింది.  సామాన్య ప్రజలు సైతం ఒకరిపై ఒకరు సోషల్ మీడియా సాక్షిగా విమర్శలు చేసుకుంటున్నారు.  మరోవైపు అంతర్జాతీయ వేదికలపై కూడా వీలు దొరికితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  ఇలాంటి సంఘటన ఒకటి లాస్ ఏంజిల్స్ లో జరిగింది.  


లాస్ ఏంజిల్స్ లో బ్యూటీకాన్ సదస్సు జరిగింది.  ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరైంది. ఆ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు ఆమెను ఎన్నో ప్రశ్నలు అడిగారు. వాటిని ప్రియాంక చోప్రా సమాధానం ఇచ్చింది.  అందులో పాక్ మహిళా అడిగిన ప్రశ్నలు ప్రియాంక చోప్రా అదిరిపోయే సమాధానం ఇచ్చింది.  "నేను పాక్ మహిళను.. మా దేశంపై భారత సైనికులు వైమానిక దాడులు చేసినపుడు జైహింద్ అని ట్వీట్ చేశారు.  యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉండి ఇలా ట్వీట్ చేయడం తప్పుకాదంటారా అని ప్రశ్నించింది.  ఈ ప్రశ్నకు ప్రియాంక చోప్రా సూటిగా సమాధానం ఇచ్చింది.  


పాక్ లో నాకు ఎంతో మంది గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు.  మొదటగా నేను భారతీయురాలిని. నా దేశాన్ని నేను గౌరవిస్తాను. నేను రెచ్చకొట్టేలా మాట్లాడలేదు.  నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో.. నేను నాదేశం తరపున అలాగే మాట్లాడాను.. ఇలా అరవడం వలన ఉపయోగం లేదు.. అందరిలోనూ పరువు పోగొట్టుకోవడం తప్పా.. మహిళలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అభివృద్ధి చెందాలి.  నేనున్నా స్థానం నుంచిసాధ్యమైనంత వరకు మహిళలను ప్రోత్సహించి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను" అని చెప్పింది.  ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది.  ఇండియా అభివృద్ధిని కోరుకుంటుంటే.. పాక్ మాత్రం ఇంకా సమస్యలు సృష్టించుకుంటూ.. గొడవలు చేసుకుంటూ దాని చుట్టూనే తిరుగుతున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: