ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాల భర్తీ చేయబోతున్న విషయం తెలిసిందే. గ్రామ/వార్డ్ సచివాలయాలకు రికార్డ్ స్థాయిలో 22.70 లక్షల ధరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ధరఖాస్తు చేయడానికి ఆగష్ట్ 10 వ తేదీని గడువుగా విధించగా గోదావరి జిల్లాల్లో వరదల కారణంగా ఒకరోజు గడువు పెంచారు. ఒకరోజు గడువు పెంచటంతో పెంచిన ఒకరోజు గడువులో 58 వేలకు పైగా ధరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. 
 
కేటగిరీ1 లోని ఉద్యోగాలైన పంచాయితీ కార్యదర్శి గ్రేడ్ 5, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, మహిళా పోలీస్ ఉద్యోగాలకు 12,86,984 ధరఖాస్తులు అందాయి. కేటగిరీ2లోని సర్వే అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాలకు 1,72,418 ధరఖాస్తులు, కేటగిరీ2 లోని వార్డ్ ఎనిమిటీస్ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 1,41,325 ధరఖాస్తులు అందినట్లు సమాచారం. 
 
కేటగిరీ3 లోని 11 రకాల ఉద్యోగాలకు 6,68,577 ధరఖాస్తులు అందినట్లు సమాచారం.గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాలకు తూర్పుగోదావరి,గుంటూరు, కర్నూలు, విశాఖ పట్టణం నుండి అత్యధికంగా ధరఖాస్తులు రాగా విజయ నగరం జిల్లా నుండి తక్కువ స్థాయిలో ధరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానికత లేని వారికి హాల్ టికెట్లు జారీ కావని, రాత పరీక్ష రాసే అవకాశం ఉండదని తెలుస్తోంది. 
 
ధరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావటంతో అతి త్వరలో హాల్ టికెట్లు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం 8 వేలకు పైగా పరీక్షా కేంద్రాలను అధికారులు సిధ్ధం చేసినట్లు సమాచారం. ఏపీపీఎస్సీ ప్రశ్నా పత్రాలు రూపొందిస్తూ ఉండగా జిల్లా సెలక్షన్ కమిటీలు ఈ పరీక్షలు నిర్వహించబోతున్నాయి. రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతూ ఉండటంతో వైసీపీ ప్రభుత్వంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: