ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద బిజినెస్ భక్తి.  భక్తి ముసుగులో ఎంత బిజినెస్ జరుగుతున్నదో చెప్పడానికి వీలులేదు.  అయితే, పైకి మాత్రం అంతా బాగున్నట్టుగా కనిపిస్తుంది. లోపల మాత్రం జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఎక్కడైనా చివరికి మోసపోయేది మాత్రం భక్తులే.  ఎందరో దొంగ స్వాములు ఎన్నో మోసాలు పాల్పడుతున్నారు. ఇలా మోసాలు చేసి పోలీసులకు చిక్కి కటకటాల పాలైన వ్యక్తులు ఎందరో ఉన్నారు.  డబ్బు సంపాదిన కోసం దొంగతనాలు చేయడం కూడా నేరమే.  దీనికి కఠిన శిక్షలు ఉంటాయి. పెద్ద పెద్ద జాతరలు, తిరునాళ్ళు జరిగే సమయంలో దొంగలు తమ చేతి వాటం ప్రదర్శిస్తుంటారు.  


ఇలా చేతివాటం ప్రదర్శించే వారి సంఖ్య విజయవాడలో ఎక్కువైంది.  ముఖ్యంగా ఇంద్రకీలాద్రిమీద దొంగల తాకిడి ఎక్కువైంది.  భక్తుల రద్దీ ఉన్న వేళలు
చూసుకొని దొంగతనానికి పాల్పడుతుంటారు.  కావాల్సింది కొట్టేశాక అక్కడి నుంచి ఎంచక్కా చెక్కేస్తారు.  ఇదే వృత్తిగా పెట్టుకున్న ఓ దొంగల ముఠా గత కొంతకాలంగా ఇంద్రకీలాద్రి పై ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నది.  కొన్ని రోజుల క్రితం ఒకేసారి మూడు దొంగతనాలు జరగడంతో.. పోలీసుల దృష్టికి వెళ్ళింది.  


దీనిపై పోలీసులు దృష్టి సారించారు.  దొంగల ముఠాను పట్టుకోవడానికి పథకం వేశారు.  సిసి టీవీ ఫుటేజ్ ను పరిశీలుస్తున్న సమయంలో వీరికి ఓ వ్యక్తి మని
పర్స్ కొట్టేస్తున్న వ్యక్తి ఫోటో కనిపించింది.  దానిని ఆధారం చేసుకొని గాలింపు మొదలుపెట్టారు.  ఇందులో భాగముగా ఓ ముగ్గురు వ్యక్తులు అనుమానితంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు.  
వారిని విచారించగా.. అనేక విషయాలు బయటపడ్డాయి.  వీరు రెండు మూటలుగా ఏర్పడి.. దొంగతనాలకు పాల్పడుతున్నారని విచారణలో తేలింది.  ఇద్దరు పురుషులు, మహిళలు, ఓ చిన్నమ్మాయి ఈ ముఠాలో ఉన్నారు.  ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరిస్తున్నా.. ఇలాంటి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.  అజాగ్రత్తగా ఉండొద్దని పదేపదే హెచ్చరిస్తున్నారు పోలీసులు.  కేవలం ఇంద్రకీలాద్రి మీదనే కాదు.. ఇలాంటి దొంగతనాలు భక్తులు ఎక్కువగా ఉండే ప్రతి దేవాలయంలోను జరుగుతూనే ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: