ఇప్పటి వరకు వెండితెరపై ఎన్నో చిత్రాల్లో చూశాం..ప్రేమికుల మద్య పెద్దల జోక్యం చివరికి ఆ ప్రేమికులు ఎన్నో కష్టాలు పడటం..అయితే ఇలాంటి వ్యహారాలు వెండి తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా ఎన్నో జరుగుతున్నాయి.  తమ మాట కాదని ప్రేమించుకున్నారని ఆ ప్రేమజంటను చితకబాదిన సందర్భాలు ఉన్నాయి..కొంత మంది మరీ దారుణంగా చంపేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.  తాజాగా అనంతపురంలో ఇలాంటి వ్యవహారమే ఒకటి వెలుగులోకి వచ్చింది. 

షెడ్యూల్ క్యాస్ట్ కి చెందిన ప్రేమజంట వ్యవహారంలో దారుణంగా దాడికి పాల్పపడ్డారు పంచాయితీ పెద్దలు.  గ్రామస్థుల ముందే ప్రేమ జంటను చితకబాదారు పెద్దలు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కేపీ దొడ్డి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  తాజాగా పంచాయితీ పెద్దల తీరుపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై మండి పడుతున్న షెడ్యూల్ క్యాస్ట్ సంఘాలు, మహిళా సంఘాలు. 

ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీ పడి భారత్ దేశం ముందుకు వెళ్తుంటే..గ్రామ స్థాయిలో మాత్రం ఇంకా ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఇందులో జోక్యం చేసుకోకపోవడం శోచనీయం అని అంటున్నారు మహిళాసంఘాలు...సామాజిక కార్యకర్తలు.  ప్రేమించుకున్నంత మాత్రాన అదో పెద్ద నేరంగా పరిగనించి అందరి ముందు అవమానం చేయడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. కులాంత వివాహాలపై వీరి దాడి, ఒకే కులంలో ప్రేమించుకున్నా దాడులకు పాల్పపడుతున్నారు.

మేజర్లు అయిన వాళ్లు పెళ్లి చేసుకోడం చట్టరిత్యా నేరం కాదని..అలాంటపుడు గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని ఇలాంటి దాడులకు పాల్పడటం ఎంత వరకు న్యాయమని మహిళాసంఘాలు ప్రశ్నిస్తున్నారు.  ఆడ పిల్ల అని కూడా చూడకుండా దారుణంగా కాలుతో తన్ని, జుట్టు పట్టుకొని, కర్రతో కొట్టడం దారుణమని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: