ఈ మద్య దేశ వ్యాప్తంగా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేతలు ఒక్కొక్కరు గా కాలం చేయడం హృదయాలను కలచి వేస్తుంది.  ఇటీవల తెలంగాణ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కన్నుమూశారు.  అంతకు ముందు ఢిలీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు ఎక్కువ పర్యాయాలు నిర్వహించిన మహిళ నాయకురాలు షీలా దీక్షిత్ కన్నుమూశారు. ఆమె చనిపోయిన ఒక్క నెలరోజుల్లో అదే ఢిల్లికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వమించిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. 

ఇలా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న సమయంలో తాజాగా బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, అద్వానీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  ఈ మద్య అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ఎయిమ్స్ లో ఆయనకు శస్త్రచికిత్స చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందరు కూడా ఎయిమ్స్‌కు చేరుకుని అరుణ్ జైట్లీ ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు.   

కొద్దీ సేపటి క్రితం అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, శ్వాశకోశ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అత్యవసరమైన విభాగంలో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స కొనసాగిస్తున్నారని సమాచారం. 66 ఏళ్ల అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పలు కీలక శాఖలను నిర్వహించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో... 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీచేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికిత్స కోసం జైట్లీ అమెరికా వెళ్లడంతో.. ఆయన బదులు పియూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. శ్వాస  తీసుకోవటం  ఇబ్బందిగా  మారటంతో ఆయన్ను 9వ  తేదీన  ఢిల్లీ  ఎయిమ్స్ లో  చేర్చారు.  అప్పటి  నుంచి  ఎయిమ్స్  ఐసీయూలోనే  చికిత్స  అందిస్తున్నారు  డాక్టర్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: